జాతీయ వార్తలు

హామీలపై మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: విశాఖలో రూ.6వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు ఆధారిత ఆటో మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ ‘కోల్డ్ స్టీల్ రోలింగ్ యూనిట్’ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీల అమలుపై గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, తెలంగాణ గనుల శాఖ మంత్రి కేటీ రామారావు, రెండు రాష్ట్రాల అధికారులతోపాటు సెయిల్, మెకాన్ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం బీరేంద్ర సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ విభజన హామీ మేరకు తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు చిత్తశుద్ధితో ఉన్నామని వెల్లడించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ నివేదిక మరో నెలరోజుల్లో రానుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఏపీ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుమాట్లాడుతూ, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎర్పాటుపై టాస్క్ఫోర్స్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం అందస్తున్న ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న ముడిఖనిజం, ఇతర సానుకూల అంశాలు పరిగణించలేదని అన్నారు. త్వరలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మికాన్ సంస్థ అందించబోయే నివేదికలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే, ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తచేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సమగ్రంగా చర్చించిందని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాలపై మరిన్ని నివేదికలు కోరిందని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరణలతో కూడిన నివేదికను సమర్పించినట్టు రంగారావు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటువల్ల రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఈలోగా కడప స్టీల్ ఫ్యాక్టరీతో సంబంధం లేకుండా విశాఖలో మరో అదనపు పరిశ్రమ ఏర్పాటుకు
కేంద్రం సముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. రూ.6వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు ఆధారిత ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుందని ఆయన వెల్లడించారు. ఇందుకు అవసరమైన స్థలం, వౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు, విశాఖలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఉక్కు ఆధారిత ఆటోమొబైల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధం లేదని చెప్పారు. త్వరలో మికాన్ సంస్థ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చిన అనంతరం కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

చిత్రం..కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చిస్తున్న సుజనా చౌదరి