జాతీయ వార్తలు

హామీ నెరవేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌కు తెలంగాణ గనుల శాఖ మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. గురువారం రామారావు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, చౌదరీ బీరేంద్రసింగ్, హర్‌దీప్‌సింగ్ పూరీలతో సమావేశమయ్యారు. విభజన హామీ ల అమలులో భాగంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు రాష్ట్ర అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ విలేఖరులతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వివరించామని తెలిపారు. ప్రాథమికంగా 70 మిలియన్ మెట్రక్ టన్నుల ముడిఇనుము బయ్యారంలో ఉందని కేంద్ర మంత్రికి వివరించినట్టు ఆయన తెలిపారు. బయ్యారంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లభించకపోతే చత్తీస్‌గఢ్‌లోని బైలా జిల్లాలో లభించే ఉక్కుతో బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. డిసెంబర్ నెలాఖరునాటికి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి డిసెంబర్ 8న ఎన్‌ఎండీసీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారని, ఈలోపు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఏవైన సమస్యలుంటే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్‌ఎండీసీ వార్షికోత్సవ సమావేశంలోనే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన కేంద్ర మంత్రి మాటాల్లోనే వింటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశం అయినట్టు చెప్పారు. 2006లో సిరిసిల్లకు చెందిన ఆరుగురు గల్ఫ్ దేశాల్లో జైలు పాలయ్యారని, ఈ అంశం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బాధితులను విడిపించే దిశలో యూనైటెట్ అరబ్ అమిరేట్స్ ప్రభుత్వంతో మాట్లాడాలని సుష్మా స్వరాజ్‌ను కోరినట్టు మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి త్వరలోనే అబూధాబిలో పర్యటిస్తామని, ఈ పర్యటనలో గల్ఫ్ బాధితులను విడిపించే విధంగా అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని సుష్మ హామీ ఇచ్చినట్టు వివరించారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్‌తో సమావేశమై, ఈ నెల 28న హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సంబంధించిన విషయాలను వివరించినట్టు కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, త్రాగునీరు, అన్ని మున్సిపాలిటీలను వందశాతం ఓడిఎఫ్‌లుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. ఈ నెల 28న హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర మంత్రి ఆసక్తి కనబరుస్తున్నారని కేటీఆర్ వివరించారు.

చిత్రం..బయ్యారంపై కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చిస్తున్న మంత్రి కేటీఆర్