జాతీయ వార్తలు

కులభూషణ్ కుటుంబానికి భద్రత ఇస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్య అక్కడికి వెళితే వారికి భద్రత ఇస్తారా? అని పాకిస్తాన్‌ను భారత్ ప్రశ్నించింది. అనేక విజ్ఞప్తుల ఫలితంగా కులభూషణ్‌ను కలిసేందుకు అతని భార్యకు అనుమతి ఇస్తామని పాక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కులభూషణ్ కుటుంబ సభ్యులు పాకిస్తాన్ వెళితే వారి వెంట భారత హైకమిషన్‌కు చెందిన అధికారిని కూడా అనుమతించాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు గురువారం తెలిపారు. కులభూషణ్ భార్యతో పాటు అతని తల్లిని కూడా జైలులోకి అనుమతించాలని పాక్ అధికారులను కోరుతూ లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. కాగా, తాజాగా భారత్ చేసిన డిమాండ్‌ను పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్టు అనధికార వర్గాల ద్వారా తెలిసింది.