జాతీయ వార్తలు

లింగమార్పిడికి సెలవు ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: లింగమార్పిడి శస్తచ్రికిత్స కోసం తనకు సెలవు మంజూరు చేయాలంటూ 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్టల్రోని బీద్ జిల్లాలో పనిచేస్తున్న లలితా సాల్వే లింగమార్పిడి చేయించుకోవాలని, ఇకపై తనను అందరూ ‘లలిత్’గా పిలవాలని కోరుకుంటోంది. శస్తచ్రికిత్స కోసం నెలరోజులపాటు సెలవు ఇప్పించేలా మహారాష్ట్ర డిజిపిని ఆదేశించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. సెలవు కోసం తాను ఇచ్చిన దరఖాస్తును పోలీసు శాఖ ఉన్నతాధికారి తిరస్కరించడంతో ఆమె న్యాయస్థానం మెట్లెక్కింది. సాల్వే తరఫున న్యాయవాది ఇజాజ్ నఖ్వీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మరో ధర్మాసనం ఈ పిటిషన్‌ను చేపడుతుందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఎస్‌ఎం కెంకార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు శుక్రవారం తన వాదన వినిపిస్తానని న్యాయవాది నఖ్వీ తెలిపారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం, 1988లో జన్మించిన లలితా సాల్వే మూడేళ్ల క్రితం తన శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గమనించారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆస్పత్రిలో కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. ఆమెలో లింగసంబంధ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇష్టపూర్వకంగా శస్తచ్రికిత్స చేయించుకుంటే ఆమెకు మానసిక ప్రశాంతత లభించవచ్చని వైద్యులు సూచించారు. దీంతో లింగమార్పిడి శస్తచ్రికిత్స కోసం నెల రోజుల పాటు సెలవు కావాలంటూ ఆమె ఎస్పీని కోరారు. అయితే, లింగమార్పిడి శస్తచ్రికిత్సకు వీలులేదని, సెలవు మంజూరు చేయలేమని బీద్ ఎస్పీ ఇటీవల స్పష్టం చేశారు. ఎస్పీ ఇలా చెప్పడం ఆమె ప్రాథమిక హక్కులను హరించివేయడమేనని న్యాయవాది అంటున్నారు.