జాతీయ వార్తలు

అభివృద్ధికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫరుఖాబాద్/ ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 23: ఉత్తరప్రదేశ్‌లో కుల, మత రాజకీయాలకు బ్రేకులు వేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో ఇక అభివృద్ధి రాజకీయాలే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘గూండారాజ్’ స్థానంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని, చర్చలు కూడా అభివృద్ధి కేంద్రంగా సాగుతాయని, కుల, మత రాజకీయాలను నియంత్రించడం జరిగిందని సీఎం అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరపున సీఎం గురువారం ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్‌పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ ఓటమిని అంగీకరించాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి పోటీయే లేదని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని, యువజనులు, రైతులు, ఇళ్లు లేని వారికోసం అనేక పథకాలకు రూపకల్పన చేసిందని పేర్కొంటూ అందువల్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. అయోధ్యలో ఇటీవలి దీపావళి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలను ఆయన గుర్తు చేస్తూ, ఫరుఖాబాద్ పట్టణాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేస్తామని, ఎలాంటి నిధుల కొరత ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్‌లో సీఎం మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించామని అన్నారు. అక్రమ పనులకు అడ్డుకట్ట వేశామని, సామాన్య ప్రజలు తమకు భద్రత ఉందని భావిస్తున్నారని పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టి కొద్ది కాలమే అయినా, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగడం ప్రారంభించిందని సీఎం అన్నారు.