జాతీయ వార్తలు

సత్యభామ వర్శిటీలో విద్యార్థుల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నయి, నవంబర్ 23: సత్యభామ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థిని రాగమోనికా ఆత్మహత్యకు పాల్పడటంతో అధికారులపై ఆగ్రహించిన తోటి విద్యార్థులు బుధవారం విశ్వవిద్యాలయ ఆవరణలో విధ్వంసానికి పూనుకున్నారు. విశ్వవిద్యాలయ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో సాయుధ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరీక్షలో కాపీ కొట్టినందుకు అధికారులు చివాట్లు పెట్టడంతో మనస్తాపానికి గురయిన రాగమోనికా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే రాగమోనికా ఆత్మహత్యకు అధికారుల వైఖరే కారణమంటూ సుమారు 300 మంది విద్యార్థులు యూనివర్శిటి క్యాంపస్ ఆవరణలో విధ్వంసానికి పూనుకున్నారు. రాగమోనికా ఆత్మహత్య విషయం తెలుసుకున్న మొదటి సంవత్సరం విద్యార్థులు ముందుగా విధ్వంసానికి పూనుకున్నారు. తరువాత ఇతర విద్యార్థులు కూడా వారికి తోడయ్యారు. అయితే రంగంలోకి దిగిన సాయుధ పోలీసులు వారికి నచ్చజెప్పి తిరిగి హాస్టళ్లకు పంపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు యూనివర్శిటి క్యాంపస్ వెలుపల పోలీసులు మోహరించి ఉన్నారు. రాగమోనికా మృతిపై పోలీసులు నేర శిక్షాస్మతిలోని సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.