జాతీయ వార్తలు

కావలసింది అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: చైనా విషయంలో టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వైఖరిలో మార్పు వచ్చిందా? టిబెట్ గురించి దలైలామా గురువారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నకు తావిస్తున్నాయి. టిబెట్ చైనా నుంచి స్వాతంత్య్రం కావాలని కోరుకోవడం లేదని, అయితే మరింత అభివృద్ధి కావాలని ఈ ప్రాంతం, ప్రజలు కోరుకుంటున్నారని దలైలామా అన్నారు. దశాబ్దాల క్రితం టిబెట్ నుంచి పారిపోయి వచ్చి, ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామా అప్పటి నుంచి ఇలాంటి ప్రకటన చేయటం ఇదే తొలిసారి. గతంలో ఏం జరిగిందనేది పక్కకు పెట్టాలని 1959 నుంచి భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామా అన్నారు. టిబెట్ ప్రజలను, వారి సంస్కృతిని చైనా గౌరవించి తీరాలని ఆయన పేర్కొన్నారు. దలైలామా చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఒకవైపు ఆ దేశం తరచుగా నిందిస్తుండగా, ఆయన మాత్రం తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, అందరి ప్రయోజనాల కోసం టిబెట్ మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. మనం భవిష్యత్తులోకి దృష్టి సారించాలి’ అని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఒక ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో మాట్లాడుతూ దలైలామా అన్నారు. ‘మేము స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదు. చైనాతోనే ఉండిపోవాలని కోరుకుంటున్నాం. అయితే మరింత అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. బయటి ప్రపంచంతో చైనా మరింత ఓపెన్‌గా ఉంటున్న విషయాన్ని దలైలామా ప్రస్తావిస్తూ, టిబెట్ పీఠభూమి అభివృద్ధికి చైనా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ‘యాంగ్‌ట్‌జె నుంచి సింధు వరకు ప్రధాన నదులన్నీ టిబెట్ మీదుగా ప్రవహిస్తున్నాయి. కోట్లాది మంది ప్రజల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి. అందువల్ల టిబెట్ పీఠభూమి గురించి మరింత శ్రద్ధ తీసుకోవడం ఈ ప్రాంతానికే కాకుండా కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని దలైలామా అన్నారు.