జాతీయ వార్తలు

ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లభిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు వస్తే, దానివల్ల ముస్లిం మహిళలకు శాశ్వతంగా స్వేచ్ఛ లభిస్తుందని శివసేన పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శివసేన ఈ విధంగా వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాఖ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, ఇంకా అనేకమంది ఆ విధానాన్ని అనుసరిస్తుండటం వల్ల ఒక చట్టాన్ని తీసుకు రావటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావడం లేదా ప్రస్తుతమున్న శిక్షాస్మృతి నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ‘ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే అది ఓ మంచి అడుగే అవుతుంది. ఎందుకంటే ఆ చట్టం ముస్లిం మహిళలకు శాశ్వతంగా స్వేచ్ఛను కల్పిస్తుంది. ట్రిపుల్ తలాక్ చెప్పే సంప్రదాయాన్ని పూర్తిగా నిషేధించాలి. దీన్ని పాటించడాన్ని నేరంగా పరిగణించాలి’ అని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయం పేర్కొంది.