జాతీయ వార్తలు

పీఎంఎల్‌ఏ బెయిల్ నిబంధనలు చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లో బెయిల్ నిబంధనలు అత్యంత కఠినంగా, ఏకపక్షంగా ఉన్నాయని, రాజ్యాంగ విరుద్ధమైన ఆ నిబంధనలను కొట్టివేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. నిందితులకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేలా ఈ నిబంధనలున్నాయని న్యాయమూర్తులు గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. రెండు షరతుల ఆధారంగా బెయిల్‌ను నిరాకరించవచ్చని చెబుతున్న పిఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్-45ను జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. మూడేళ్లు జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న నేరారోపణలను ఎదుర్కొంటున్న వారి బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించే అవకాశాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ఇవ్వకుండా, ఎవరికీ బెయిల్ ఇవ్వరాదన్నది మొదటి నిబంధన. నేరారోపణల్లో నిందితుడు దోషి కాదని న్యాయస్థానం ప్రాథమికంగా సంతృప్తి చెందినపుడు, బెయిల్‌పై విడుదలైనా ఏ నేరానికి పాల్పడబోరని నమ్మకం కలిగినపుడే బెయిల్ ఇవ్వవచ్చన్నది రెండో నిబంధన. ఈ నిబంధనల వల్ల బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమవుతోందని చాలామంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయసూత్రాలకు, సుప్రీం కోర్టు తీర్పులకు ఈ నిబంధనలు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ, కఠినతరమైన ఈ నిబంధనలు నిర్హేతుకమైనవని, రాజ్యాంగ విరుద్ధమని, వీటిని ఇంకా కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను ఈ నిబంధనలు ధిక్కరిస్తున్నాయని ధర్మాసనం భావించింది. ఏ నేరారోపణలోనైనా నిందితుడు నిర్దోషి అయి ఉండవచ్చన్న ప్రాథమిక సూత్రాన్ని ఈ నిబంధనలు వెనక్కినెట్టేస్తున్నాయని వ్యాఖ్యానించింది. విచక్షణారహితంగా ఉన్న ఇలాంటి నిబంధనలను అమలు చేయడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పిఎంఎల్‌ఏ చట్టం కింద నేరారోపణలను ఎదుర్కొంటున్న నిందితునికి బెయిల్ మంజూరు చేయవచ్చని, కేసు విచారణ సాగినంతకాలం బెయిల్ కొనసాగవచ్చని పేర్కొంది. సెక్షన్-45 కింద నిందితులకు బెయిల్ నిరాకరించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ, ఈ తరహా కేసులను మరలా విచారించాలని ధర్మాసనం ఆదేశించింది. మనీ లాండరింగ్ అభియోగాలపై ఎవరినైనా అరెస్టు చేసినపుడు, బెయిల్ పొందే విషయంలో అమలయ్యే సెక్షన్- 45 క్రమరహితంగాను, హక్కులను హరించే విధంగాను ఉందని కోర్టు అభిప్రాయపడింది. కాగా, మనీ లాండరింగ్ కేసుల్లో బెయిల్‌కు సంబంధించి కీలక నిబంధనలను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఆ ప్రభావం అనేక కేసులపై పడే అవకాశం ఉంది.