జాతీయ వార్తలు

మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్‌బందర్, నవంబర్ 24: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని శుక్రవారం ఆయన హామీ ఇచ్చారు. గుజరాత్‌లో అధికార బిజెపి మత్స్యకారులను పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. మరబోట్లకు అవసరమైన డీజిల్ కొనుగోలుకు చెల్లించే సబ్సిడీలో కోత విధించారని ఆయన విమిర్శించారు. పది, పదిహేను మంది పారిశ్రామిక వేత్తలను ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలే మోదీ చేపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేద ప్రజల సంక్షేమం బిజెపికి ఏమాత్రం పట్టడదని కాంగ్రెస్ నేత విమర్శించారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే తీర ప్రాంతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చేనెలలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 22 ఏళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ‘చేపల వేట కూడా వ్యవసాయం లాంటిదే. జాలర్లూ రైతులతోపాటు సమానంగా కష్టపడుతున్నారు. అందుకే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రివర్గం ఏర్పాటుచేసి ఆదుకుంటాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో కోత వేసే ప్రధాని నరేంద్రమోదీ టాటామోటర్ నానోకార్ల కంపెనీకి కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందజేశారని ఆయన విమర్శించారు.

చిత్రం..పోర్‌బందర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న రాహుల్‌గాంధీ