జాతీయ వార్తలు

తీరం కేంద్రానిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 25: కృష్ణా- గోదావరి బేసిన్ ఆఫ్ షోర్ చమురు, గ్యాస్ వెలికితీత కార్యకలాపాలపై రాష్ట్రానికి రాయల్టీ ఇవ్వాలన్న ఆంధ్ర విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. తీర ప్రాంతాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయని అంటూ, రాయల్టీలు ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెప్పింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి 12వ స్థారుూ సంఘ సమావేశం శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. సమావేశానికి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, తోవర్ చంద్ గెహ్లాట్, హర్‌దీప్ సింగ్ పూరీ, ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, నవీన్ పట్నాయక్, వసుంధర రాజే, మాణిక్ సర్కార్, వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీ సిఎం చంద్రబాబు తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశానికి హాజరయ్యారు. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టంలోని నిబంధనలు సడలించి అధికంగా రుణాలు తెచ్చుకోవడానికి అనుమించాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సమావేశం అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర- రాష్ట్ర సంబంధాలపై పూంచ్ కమిషన్ చేసిన సిఫార్సులను సమావేశంలో చర్చించడంతోపాటు, పలు రాష్ట్రాలు దీనిపై సలహాలు సూచనలు చేశాయని అన్నారు. రాష్ట్రాల్లోని ఖనిజాలపై ఇవ్వాల్సిన రాయల్టీలను కేంద్రం పది, ఇరవైయేళ్లకు ఓసారి మదింపు చేసి పెంచుతోందని చెబుతూ, ఈ అంశంపై ప్రతి మూడేళ్లకోసారి మదింపు జరగాలన్న పూంచ్ కమిటీ సిఫార్సులను సమావేశంలో ప్రస్తావించామని, ఆ సిఫార్సులను ఏపీ ప్రభుత్వం సమర్థించిందని వివరించారు. దీని అమలుపై స్థారుూ సంఘం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఆంధ్రకు ప్రధాన వనరుగా తీరప్రాంతం ఉంది కనుక, తీరంలో సాగుతోన్న ఆఫ్ షోర్ కార్యకలాపాలపై రాయాల్టీ చెల్లించాలని కేంద్రాన్ని కోరామన్నారు. 12 నాటికల్ మైళ్ల పరిధిలో జరుగుతోన్న ఆఫ్ షోర్ తవ్వకాలపై రాయిల్టీ చెల్లిస్తే రాష్ట్రాదాయం పెరుగుతుందన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. గతంలో ఇటివంటి రాయల్టీలు గుజరాత్‌కు ఇచ్చిన విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినట్టు యనమల వివరించారు. అయితే సముద్ర తీర ప్రాంతాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయని, ఆంధ్రకు రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం ఈ సమావేశంలో స్పష్టం చేసిందన్నారు. అలాగే టూ జీ, త్రీ జీ స్పెక్ట్రం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంచిత నిధి ద్వారా రాష్ట్రాలకూ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలు రాష్ట్రాలు విజ్ఞప్తి చెయ్యగా, కేంద్రం దీనిపై స్పందించలేదని యనమల వివరించారు. పిల్లలకు నిర్బంధ విద్య హక్కు చట్టం అమలుకు రాష్ట్రాలు చేస్తున్న వ్యయం మొత్తం కేంద్రమే భరించాలని కూడా విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలు సడలించి అధిక రుణాలు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరామన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి కొంత వెసులుబాటు ఉండటంతో, ఈ విషయంలో కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని మంత్రి వెల్లడించారు.
చిత్రం..అంతర్రాష్ట్ర మండలి స్థారుూ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్