జాతీయ వార్తలు

‘మందిరం’ తప్ప మరో కట్టడం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడిపి (కర్నాటక), నవంబర్ 24: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలే తప్ప మరో ‘కట్టడం’ అనే ప్రస్తావన ఉండరాదని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ శుక్రవారం ప్రారంభమైన ‘్ధర్మ సంసద్’లో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో మందిరానికి తప్ప మరో కట్టడానికి అవకాశం లేదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల మంది హిందూ సన్యాసులు, మఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ‘్ధర్మ సంసద్’లో పాల్గొంటున్నారు. అయోధ్యలో మందిరం నిర్మాణంపై ఎలాంటి సందిగ్థత ఉండరాదని భగవత్ తన వాదాన్ని బలంగా వినిపించారు. ‘మందిరాన్ని నిర్మించి తీరుతాం.. ఇది ప్రచారం కోసం కాదు.. హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు..’ అని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నో త్యాగాలు, ఎంతో కృషి ఫలితంగా మందిర నిర్మాణం సాధ్యమయ్యే పరిస్థితులు ఇపుడు కనిపిస్తున్నాయని, కొన్ని కారణాలతో ఈ వివాదం ఇంకా కోర్టు పరిధిలో ఉందన్నారు. శ్రీరాముడి జన్మస్థలం కాబట్టి మందిరం తప్ప మరో కట్టడానికి అయోధ్యలో వీలు లేదన్నారు. గత వైభవాన్ని తలపించే రీతిలోనే మందిర నిర్మాణం సాగుతుందని, పాతికేళ్ల క్రితం రామజన్మభూమి ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయన్నారు. ఆ ఉద్యమంలో సేకరించిన రాళ్లను మందిర నిర్మాణంలో వినియోగిస్తామన్నారు. మందిర నిర్మాణానికి ముందుగా ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని, తాము లక్ష్యానికి చేరువగానే ఉన్నామని, అయినా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని భగవత్ వివరించారు. రామమందిర నిర్మాణం, మతమార్పిడులు, గోసంరక్షణ తదితర విషయాలను మూడు రోజులపాటు జరిగే ‘్ధర్మ సంసద్’లో చర్చిస్తారు. వివిధ రూపాల్లో హిందూ సమాజంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా ఈ సదస్సులో చర్చిస్తారని తెలిసింది.