జాతీయ వార్తలు

మూకుమ్మడి అత్యాచారాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మే 31: హర్యానాలో గత ఫిబ్రవరిలో ఉవ్వెత్తున జరిగిన జాట్ల ఆందోళనలో జరిగిన అరాచకాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పడిన ప్రకాష్‌సింగ్ కమిటీ నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. హైకోర్టు సమర్పించిన ఈ నివేదికలో మూకుమ్మడి అత్యాచారాలు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కార్లలోంచి మహిళలను బయటకు లాగి వివస్తల్రను చేసిన ఆందోళనకారులు మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడ్డారని పేర్కొంది. వాహనాల్లో ప్రయాణిస్తున్న మహిళలను బలవంతంగా బయటకు లాగి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో అత్యాచారాలు జరిపారని నివేదించింది. అత్యాచారాలకు గురైన మహిళలు ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో సమీపంలో ఉన్న దాబాను ఆశ్రయించారని కూడా పేర్కొంది. హర్యానాలోని ముర్తల్‌లో దాబా యజమానులు దీన్ని ధ్రువీకరించారని కూడా స్పష్టం చేసింది. దాబా యజమానులు, స్థానికులు వారికి వస్త్రాలు, దుప్పట్లు అందజేయడంతో పాటు వారు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు కూడా సాయపడ్డారని ఈ కేసులో హైకోర్టుకు సహకరిస్తున్న సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా వెల్లడించారు. ప్రకాష్‌సింగ్ నాయకత్వంలో కమిటీ సభ్యులు జరిపిన విచారణలో దాబా యజమానులు ఈ విషయాలను స్పష్టం చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదికను కోర్టుకు సమర్పించింది.
తొమ్మిది రోజుల పాటు జరిగిన జాట్ల ఆందోళనలో చోటుచేసుకున్న అరాచకాలను మీడియా అప్పట్లో బయటపెట్టింది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయని, పదిమంది మహిళలపై లైంగిక దాడి జరిగిందని వెల్లడించింది. సుమారు 40మంది దుండగులు ఈ అకృత్యాలకు పాల్పడ్డారని కూడా బయటపెట్టింది. ముర్తల్‌లో జరిగిన అకృత్యాలకు సాక్షీభూతంగా పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడివున్న మహిళల లోదుస్తులు, దుస్తులు పడివున్న చిత్రాలు అప్పట్లో సంచలనం కలిగించాయి. అయితే మూకుమ్మడి అత్యాచార ఆరోపణలను హర్యానా పోలీసులు ఖండించారు. వాహనాలను ఆపుతున్న ఆందోళనకారులనుంచి తప్పించుకునేందుకు మహిళలు పరుగులు తీయడంతో వారి బ్యాగులనుంచి అవి బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. కాగా, జాట్ల ఆందోళనలో మూకుమ్మడి అత్యాచారాలు కేవలం ఊహాగానాలేనంటూ హర్యానా ప్రభుత్వం, పోలీసులు చెబుతూ వచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో విచారణ జరిపేందుకు మహిళా సభ్యులతో కమిటీని నియమించింది.