జాతీయ వార్తలు

హే రామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: పొద్దున లేచిన దగ్గర్నుంచి సభలు, సమావేశాల వేదికలపై జాతిపిత మహాత్మాగాంధీ నామస్మరణ చేసే పాలకులు ఆ మహనీయును సమాధి రాజ్‌ఘాట్ పట్ల ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారో తెలియజేసే ఘటన ఇది. గాంధీ సమాధి వద్ద కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వ విభాగాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజ్‌ఘాట్ వద్ద నిర్వహణలోపాన్ని ఎండగట్టిన కోర్టు తక్షణం పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశించింది. దేశ విదేశాల నుంచి ఎందరో రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీ మహాత్ముడికి నివాళులర్పిస్తుంటారు. అయితే సందర్శకుల కోసం అక్కడ కనీస సదుపాయాలూ కల్పించకపోవడం చూసి ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం షాక్‌కు గురైంది. తక్షణం ఘాటన్‌కు వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాలని బెంచ్ ఆదేశించింది. సందర్శకులకు తాగునీరు కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ చూడాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. గాంధీ సమాధి స్థలంలో శుభ్రత, సదుపాయాలకు సంబంధించి పిటిషన్ దాఖలయ్యేవరకూ అక్కడి దారుణ పరిస్థితులు వెలుగుచూడకపోవడం, సంబంధిత విభాగాలూ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసింది. రాజ్‌ఘాట్ సమాధి కమిటీ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(సీపీడబ్ల్యూడీ) తీరుపై కోర్టు మండిపడింది. విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, తక్షణం అక్కడికి వెళ్లాలని ఆదేశించింది. సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ వ్యక్తిగతంగా ఘాట్‌ను సందర్శించి పరిస్థితులు తెలుసుకోవాలని న్యాయమూర్తులు తెలిపారు. జాతిపిత సమాధి వద్ద సదుపాయలపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణ డిసెంబల్ 4వ తేదీకి వాయిదా పడింది. రాజ్‌ఘాట్ అపరిశుభ్రంగా ఉంటోందని, సందర్శకులకు కనీస సౌకర్యాలే లేవంటూ శ్యామ్ నారాయణ్ ఛౌక్సే కోర్టులో పిల్ వేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు.