జాతీయ వార్తలు

15నుంచి పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ పదిహేనో తేదీనుంచి జనవరి ఐదోతేదీ వరకు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటి (సిసిపీఎ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీతో సహా 14 రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా అనేక కీలక అంశాలపై ఉభయ సభలలో చర్చించాల్సి ఉందని, కీలకమైన బిల్లులు కూడా ఈ సమావేశాల ముందుకు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) బిల్లులు కీలకమైనవని, వాటితో పాటు ఇటివల కేంద్రం తీసుకొచ్చిన దివాలా చట్టం, భారత అటవీ సవరణ చట్టాలపై కేంద్ర తీసుకొచ్చిన ఆర్డినెన్సులను కూడా ఈ పార్లమెంట్ సమావేశాలలో చర్చించి ఆమోదించాల్సి ఉందని చెప్పారు. అందువల్ల సమావేశాలు విజయవంతంగా జరిగేలా సహకరించాలని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి ఏడాది నవంబర్ మూడు లేదా చివరి వారంలో నిర్వహించే సమావేశాలు గుజరాత్ శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఈ దఫా కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయ. రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన ముగియ నుండటంతో శీతాకాల సమావేశాలను డిసెంబర్ 15వ తేదీ నుంచి కేంద్రం ఖరారు చేసింది.
జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, రాఫల్ విమానాల ఒప్పందాలపై ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను పార్లమెంట్‌లో విపక్షాలను ఎదుర్కొనలేక పార్లమెంట్ సమావేశాలను గుజరాత్ ఎన్నికలు పూర్తయన అనంతరం నిర్వహిస్తున్నారని విపక్షలు ఆరోపించాయి. అలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసమే పార్లమెంట్ సమావేశాలను ఆలస్యం చేసిందని నరేంద్రమోదీ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల తేదీల నిర్ణయాన్ని బీజేపీ సమర్థించుకుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సమావేశాలను ఆలస్యంగా నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయని బీజేపీ గుర్తుచేసింది.
ఈసారి పార్లమెంట్ సమావేశాలు మొదలైన అనంతరం రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో దాని ప్రభావం ఉండబోతుంది. ఈ సమావేశాలలో కీలక బిల్లులు ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే గత సమావేశాలలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ బిల్లు చివరి నిమిషంలో పార్లమెంట్ ఎగువసభలో పాస్ అయినా, దిగువ సభలో ఆమోదం పొందలేదు. ఈసారి ఈ బిల్లు ఎట్టి పరిస్థితులలోను ఆమోదింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.