జాతీయ వార్తలు

పార్లమెంట్ పరీక్షకు నిలువకుండా మోదీ సర్కారు పలాయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కీలకమైన అనేక అంశాలపై పార్లమెంట్‌లో పరీక్షకు నిలవకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ముందు ముఖం చాటేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు (డిసెంబర్ 15వ తేదీన) ప్రారంభమై జనవరి 5వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే.
నల్లధనాన్ని వెలికితీస్తామని ప్రజలకు పెద్దపెద్ద హామీలు ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వాస్తవానికి మోదీ సర్కారు హయాంలోనే దేశంలో నల్లధన వినియోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ విమర్శించారు.