జాతీయ వార్తలు

నా భర్తతోనే ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొట్టాయం, నవంబర్ 25: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లవ్ జిహాదీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను భర్తతోనే ఉంటానని కేరళ యువతి హదియా వెల్లడించింది. ఈనెల 27న సుప్రీం కోర్టులో లవ్ జిహాదీ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పడానికి ఆమె ఢిల్లీ బయలుదేరింది. తల్లిదండ్రులు, భద్రతా సిబ్బందితో నెడుంబస్సెరీ విమానాశ్రయానికి చేరుకున్న హదియా వాళ్లను వదిలేసి దూరంగా వచ్చి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ప్రతినిధులు ఆమె వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకుని హదియాను విమానాశ్రయం లోనికి తీసుకెళ్లిపోయారు.‘నేను ముస్లింనే. ననె్నవరూ బలవంతపెట్టలేదు. నా భర్తతోనే ఉంటాను. మమ్మల్ని ఎవరూ వేరుచేయలేరు’అంటూ 25 ఏళ్ల హదియా బిగ్గరగా అరుస్తూ చెప్పింది. బురఖా వేసుకున్న ఆమె ఎయిర్‌పోర్టులోనికి వెళ్తూ ‘నా భర్త దగ్గరే ఉంటా’నని వెల్లడించింది. ఇస్లాం మతం తీసుకున్న కేరళ యువతి ముస్లిం యువకుడు షాఫిన్ జహాన్‌ను పెళ్లాడింది. అయితే ఆమెతో బలవంతగా మతమార్పిడి చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా జహాన్‌కు కొన్ని రాడికల్ సంస్థలతో సంబంధాలున్నందున పెళ్లి కాస్తా వివాదం అయింది. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్‌ఐఎస్‌తో అతడికి సంబంధాలున్నట్టు ఆరోపణ. ఇందులో భాగంగానే హిందూ అమ్మాయిని ఇస్లాంలోకి మార్పించారని పోలీసులు పేర్కొన్నారు. ఇది ఎన్‌ఐఏ దర్యాప్తువరకూ వెళ్లింది. దీన్ని జహాన్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. ఎన్‌ఐఏ దర్యాప్తును రీకాల్ చేయాలంటూ సెప్టెంబర్ 20న పిటిషన్ వేశాడు. అలాగే పెళ్లిని కేరళ హైకోర్టు రద్దుచేయడాన్ని అతడు సవాల్ చేశాడు. మహిళ స్వేచ్ఛను హరించేలా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీంకు తెలిపాడు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం యువతి తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందా? లేదా విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు అమ్మాయిని తమ మందు ప్రవేశపెట్టాలని ఆమె తండ్రి తరఫున్యాయవాది శ్యామ్‌దివాన్‌ను ఆదేశించింది. ఢిల్లీ వెళ్లిన హదియా, ఆమె తల్లిదండ్రులు కేరళ హౌస్‌లో బస చేయనున్నట్టు తెలిసింది. కాగా షాఫిన్ జహాన్ తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు.