జాతీయ వార్తలు

ఎస్‌పి,బిఎస్‌లను ‘పెకిలించివేస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్,మే 31: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అలాగే బిఎస్‌పిలను పెకిలించివేస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. కాంగ్రెస్ సారధ్యంలోని అవినీతిమయమైన యుపిఏ సర్కార్‌కు మచ్చలేని ఎన్‌డిఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. ఈరెండేళ్ల పాలనలో ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి పనిచేసిందని, ఎలాంటి ఆరోపణలకు తావులేని పరిపాలన అందించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం సాధించిందేమిటంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడాన్ని అమిత్‌షా సవాల్ చేశారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో కొనసాగిన యుపిఏ కంటే కూడా ఈ రెండేళ్లలోనే మోదీ సర్కార్ సాధించిన విజయాలను ఆయన ఏకరువుపెట్టారు. ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని అంద్వాలో జరిగిన ఓ సభలో మంగళవారం మాట్లాడిన అమిత్‌షా‘దేశానికి సంబంధించిన ప్రతి అంశంపైనా స్పందించి మాట్లాడే ప్రధాన మంత్రిని అందించాం. మీరు మాత్రం వౌనీబాబా(మన్మోహన్)ను ప్రధానిగా కొనసాగించారు. మీ హయాంలో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి తాండవించింది. ఎన్‌డిఏ ప్రభుత్వం మచ్చలేని విధంగానే రెండేళ్ల పాలనను పూర్తిచేసుకుంది’అని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా ఉందని, మోదీ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు చేరకపోవడానికి కారణం అఖిలేష్ ప్రభుత్వం ఏమాత్రం సహరించకపోవడమేనని అమిత్‌షా విమర్శించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి 71 లోక్‌సభ స్థానాలను గెలుచుకోకపోయి ఉంటే కేంద్రంలో పరిపూర్ణమైన మెజారిటీ వచ్చి ఉండేది కాదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అలాగే బిఎస్‌పిలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

చిత్రం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా