జాతీయ వార్తలు

దోషుల్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: ఆఫ్రికా దేశీయులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఢిల్లీలో చోటుచేసుకున్న కాంగో యువకుడి హత్య జాతి విద్వేషనేరం కాదని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కాంగో దేశానికి చెందిన యువకుడిపై రెండురోజుల క్రితం కొందరు ఢిల్లీలో దాడికి పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో దుమారం రేపిన ఘటనపై ఇప్పటికే కేంద్రం చర్యలు చేపట్టింది. ఆఫ్రికా జాతీయులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలావుంటే, మంగళవారం తనను కలిసిన ఆఫ్రికా జాతీయులు, విద్యార్థులకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ భద్రతాపరమైన హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూనియర్ మినిస్టర్ వికె సింగ్, విదేశీ కార్యదర్శి ఎస్ జైశంకర్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఆఫ్రికా జాతీయులతో సమావేశమైన స్వష్మ మాట్లాడుతూ ఢిల్లీలో చోటుచేసుకున్న కాంగ్రెస్ జాతీయుడు మాసండా కెటాడ ఓలివర్ హత్యను జాతిపరమైనదిగా చూడొద్దన్నారు. ఓలివర్ హత్య కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి దోషులకు చట్టపరంగా అత్యంత కఠిన శిక్షలు విధిస్తామని హామీ ఇచ్చారు. సిసి టీవీ ఫుటేజీని పరిశీలించినపుడు ఓలివర్‌ను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించటం, స్థానికులపైనా నిందితులు దాడికి దిగడాన్ని గమనిస్తే హత్య జాతిసంబంధమైనది కాదని అర్థమవుతోందన్నారు. ఏదేమైనా దాడి ఆటవిక చర్యను మరిపిస్తుందని అంటూ, దేశానికి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆఫ్రికా జాతీయులు ఎక్కువగా నివాసం ఉంటున్న రాష్ట్రాలకూ తగు భద్రతా చర్యలకై ఆదేశాలు జారీ చేశామన్నారు. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న స్వష్మాస్వరాజ్, మంగళవారం తొలి అధికారిక కార్యక్రమంగా ఆఫ్రికా జాతీయులతో సమావేశమయ్యారు. విదేశీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తిమేరకు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన విరమించిన ఆఫ్రికా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. గతవారం భారత్ నేతృత్వంలో నిర్వహించిన ఆఫ్రికా డే ఉత్సవాల్లో పాల్గొన్నవారిని ప్రశంసించారు.

చిత్రం ఆఫ్రికా దేశంకు చెందిన విద్యార్థులతో మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్