జాతీయ వార్తలు

వైద్య సీటుకు కోటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: సంచలనాత్మక వ్యాపం నియామక వ్యవహారాల కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. దాదాపు 200మంది వైద్యవిద్యార్థుల భవితవ్యం సందిగ్ధంలో పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ అక్రమాల ద్వారానే 200మందికి పైగా విద్యార్థులు ప్రవేశాన్ని పొందినట్లుగా సీబీఐ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. మేనేజిమెంట్ కోటాలోనే భారీ మొత్తాన్ని చెల్లించి వీరంతా ఆయా వైద్య కళాశాలల్లో ప్రవేశాన్ని పొందినట్లుగా సీబీఐ నిర్ధారించింది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఏ రకమైన పరీక్ష రాయకుండానే ప్రవేశాన్ని పొందిన వీరందరిపై చర్య తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షా బోర్డు (వ్యాపం) 2012లో నిర్వహించిన పరీక్షలో అనేక రకాలుగా అక్రమాలు జరిగినట్లుగా సీబీఐ తన నివేదికలో తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 592మందిపై భోపాల్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ కూడా ఈ దర్యాప్తు సంస్థ దాఖలు చేసింది. వీరిలో నాలుగు ప్రైవేటు కళాశాలల చైర్మన్లు కూడా ఉన్నారని, వీరందరికీ ఈ నియామక కుంభకోణంతో సంబంధం ఉందని తెలిపింది. మేనేజిమెంట్ కోటా కింద మొత్తం 229మంది విద్యార్థులకు 50 లక్షల నుంచి కోటి రూపాయల చొప్పున భారీ మొత్తాన్ని వసూలు చేసి ఈ నాలుగు ప్రైవేటు కళాశాలలు ప్రవేశ పరీక్ష రాయకుండానే సీట్లు ఇచ్చినట్లుగా సీబీఐ తెలిపింది. మేనేజిమెంట్ కోటాలో సీట్లు పొందడం కంటే కూడా కనీస అర్హతను నిర్ణయించే ఎలాంటి ప్రవేశ పరీక్షనూ ఈ విద్యార్థులు రాయకపోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోందని సీబీఐ తెలిపింది.