జాతీయ వార్తలు

మరింత సమర్థంగా సంస్కరణల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను మరింత పటిష్ఠంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారంనాడు రాజీవ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, దివాల స్మృతి చట్టం బిల్లు, బినామి చట్ట బిల్లులతోపాటు కీలక సంస్కరణలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 42 నెలల కాలంలో చేపట్టిన సంస్కరణలద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాంధించేందుకు సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సంస్కరణలను ఫలప్రదంగా ముగించడంపై దృష్టి సారించాలని సూచించారు. రానున్న 18 నెలల కాలంలో మానవ వనరుల అభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాలలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల కల్పనలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమయిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్‌ఓ, జాతీయ పించను పథకంలో ఖాతాల సంఖ్య పెరిగిందని ఆయన గుర్తుచేశారు. పర్యాటకం, పౌర విమాన యానం, రావాణా, సేవల రంగాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో గణనీయమైన పెరుగుదలను సాధించాయని ఆయన వివరించారు.