జాతీయ వార్తలు

‘కస్టడీ వేధింపుల’పై చట్టం కోసం ఆదేశించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: పోలీస్ కస్టడీలో వేధింపులు, అమానవీయ ఘటనలను నిరోధించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించజాలమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘కస్టడీ హింస’పై ఐక్యరాజ్య సమితి చేసిన వేధింపుల నిరోధక తీర్మానాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నందున- చట్టాన్ని రూపొందించాలని తాము తీర్పు ఇవ్వలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. కస్టడీ వేధింపులపై ‘లా కమిషన్’తో చర్చిస్తున్నట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించడంతో ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది అశ్వనీ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ మాదిరి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కస్టడీ వేధింపులపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. అన్ని విషయాలనూ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, ఐరాస తీర్మానాన్ని అమలు చేయాలని, ప్రత్యేక చట్టం రూపొందించాలని తాము ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించలేదని న్యాయమూర్తులు వెల్లడించారు.