జాతీయ వార్తలు

భారీగా పెరిగిన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 2.58 పైసలు, డీజిల్ లీటర్‌కు 2.26 పైసలు పెరిగాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. తాజా వడ్డింపుతో ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 65.60 పైసలు, డీజిల్ లీటర్ 53.93 పైసలకు చేరుకుంది. చివరి సారిగా ఈనెల 16న పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలో వచ్చిన మార్పులు అలాగే డాలర్ మారక విలువతో రూపాయి విలువ తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థితిగతులు, రూపాయి మారక విలువను సమీక్షిస్తూ నిర్ణీతకాల వ్యవధిలో సవరించడం జరుగుతుందని ఐఓసి తెలిపింది.