జాతీయ వార్తలు

పోలీసు నియామకాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: తెలంగాణ పోలీసు శాఖలో నియామకాల ప్రక్రియ కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణను త్వరగా ముగించాలని ఉమ్మడి హైకోర్టుకు సూచిస్తామని సుప్రీం పేర్కొంది. తెలంగాణ పోలీసు శాఖలో ఏఆర్, సివిల్, వివిధ బెటాలియన్లలో 11,650 పోస్టుల నియామకాల ప్రక్రియను పోలీసు శాఖ చేపట్టింది. ఈ నియామకాలలో అనర్హులకు చోటుదక్కిందన్న పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నియమకాలకు అభ్యంతరం లేదని గతంలో తీర్పిచ్చింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని బండా శ్రీనివాస్ గౌడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ- పోలీసు నియామకాల్లో 188 మంది అనర్హులున్నారని, దీనిని హైకోర్టు కూడా గుర్తించిందని, ఈ నేపథ్యంలో నియామకాలు చేపడితే అర్హులకు అన్యాయం జరుగుతుందని వాదించారు. నియామకాలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఉమ్మడి హైకోర్టు త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని సూచిస్తామని ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది.