జాతీయ వార్తలు

అవయవ దానంలో తెలంగాణకు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. 8వ జాతీయ అవయవ దానం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్రం తరపున జీవన్‌దాన్ పథకం కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత స్వీకరించారు. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలలో తెలంగాణ అత్యత్తమ ప్రతిభ కనబరించింది. ఈ పురస్కారాలలో మొదటిస్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో మహారాష్ట్ర నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. అవయవాల మార్పిడిలో ఎక్కువ శస్తచ్రికిత్సలు చేసినందుకుగాను యశోద హాస్పిటల్‌కు ఉత్తమ పురస్కారం లభించింది. యశోద హాస్పిటల్‌కు లభించిన అవార్డును ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రావు అందుకున్నారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరిస్తున్న జవన్‌థాన్ కో ఆర్డినేటర్ స్వర్ణలత, యశోదా ఆస్పత్రి చైర్మన్ రవీందర్‌రావు