జాతీయ వార్తలు

‘నేను జయ కుమార్తెను’ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ యువతి పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎంబి లోకుర్, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ‘తాను జయలలిత కుమార్తెను. కావాలంటే డిఎన్‌ఏ పరీక్ష చేయంచండి’ అంటూ 37ఏళ్ల అమృత అలియాస్ మంజుల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మంజుల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. అయ్యంగార్ బ్రాహ్మిన్ వర్గానికి చెందిన జయలలిత అంతక్రియలను హిందూ ధర్మ పద్ధతి ప్రకారమే జరిపారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ, కావాలనుకుంటే ఈ అంశంపై ఫిర్యాదుదారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.