జాతీయ వార్తలు

ఆహా.. ఏమి ఈ భాగ్యమూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔత్సాహిక భారతం ఉత్తుంగ తరంగమైంది.
అనితర సాధ్యమన్న రీతిలో దాదాపు 30 కిలోమీటర్ల హైదరాబాద్ మహానగర కంఠాభరణంగా మెట్రో
ఆవిష్కృతమైంది. పధ్నాలుగేళ్ల మెట్రో రైలు కలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వీయ ప్రయాణంతో నగర ప్రజల ‘గగనతల యానా’నికి శ్రీకారం చుట్టారు. మెట్రో వెలుగు జిలుగుల మధ్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలు, ఆకాంక్షలకు ఉద్దీపనగా గ్లోబల్ శిఖరాగ్ర సదస్సు విజయగాధల వేదికగా
మొదలైంది. 150 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు యువత మేటవేసిన భారతదేశ
అద్వితీయతను జగతికి చాటింది. యువతకు ఊతంగా, మహిళా శక్తికి ప్రేరణగా నిలిచింది.
భారత పురాణాలు మొదలుకుని ఆధునిక ప్రపంచ యవనికపై మహిళా విజయాలను ప్రధాని మోదీ ప్రస్తుతిస్తే.. నవభారతం నవనవోనే్మషమంటూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంక హర్షధ్వానాల మధ్య ఉద్ఘాటించారు. ఈ రెండు సమున్నత పరిణామాలకు
ఏకకాలంలో వేదికగా మారిన ముత్యాల నగరం ప్రగతి పథంలో మేలి మలుపు. రతనాల్లాంటి
యువ శక్తి నవ్యావిష్కరణల జిజ్ఞాసకు మేలుకొలుపు.

చిత్రం..ముఖ్య అతిథి ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీని జీఈఎస్‌కు ఆహ్వానం పలుకుతున్న బెంగళూరు సంస్థ దేశీయంగా రూపొందించిన రోబో మిత్ర. తన గుండెలపైనున్న మానిటర్‌లో సమ్మిట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రదర్శిస్తున్నపుడు చిర్నవ్వుతో ఆశ్చర్యంగా తిలకిస్తున్న ఇవాంక, మోదీ