జాతీయ వార్తలు

మహిళా స్ఫూర్తి.. దేశానికి దీప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: భారత్- అమెరికాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ టెక్నాలజీకే కాదని, భారత్- అమెరికా ధృడమైన సంబంధాలకు ప్రతీకగా అభివర్ణించారు. హెచ్‌ఐసిసి వేదికగా మంగళవారం సాయంత్రం అమెరికా శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్‌తో కలిసి ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే స్టార్టప్ ఇండియా లక్ష్యమన్నారు. డిజిటల్, లైఫ్ సైనె్సస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తున్నాయని వివరించారు. మహిళలకే తొలి ప్రాధాన్యం అనేది భారతీయ చరిత్ర, సంస్కృతిలో భాగమని, మహిళా భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. జీఈఎస్‌లో 50 శాతానికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనడం ముదావహమన్నారు. ప్రపంచ బ్యాంకు నిర్వహించే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భారత్ ర్యాంకు మెరుగుపడిందని గుర్తు చేశారు. 100వ ర్యాంకుతో తాము సంతృప్తి చెందడం లేదంటూ, 50వ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆవిష్కరణలకు, వ్యాపార వేత్తలకు భారత్ ఇంక్యుబేటర్‌గా పనిచేస్తుందని చెప్పారు. దశాంశ మానం, సున్నా ఆవిష్కరణలు భారత్ మేధోశక్తికి నిదర్శనమని అన్నారు. పురాతన కాలం నుండి మన వాణిజ్య పురోగతికి లోథల్ నౌకాశ్రయం నిదర్శనమని అన్నారు. మానవాళి జీవన ప్రమాణాల మెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు చేసే శక్తి భారతీయులకు ఉందన్నారు. స్టార్టప్ ఇండియా ఔత్సాహికులకు సహకారం అందించే సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నామని వివరించారు. అనేక అడ్డంకులు సృష్టించే పాత చట్టాలను చెత్తబుట్టలో వేశామని, గత మూడేళ్లలో కొత్త సంస్కరణలతో సరళతర వాణిజ్యంలో 140 నుండి 100వ ర్యాంకుకు చేరుకున్నామని మోదీ తెలిపారు. జన్‌ధన్ యోజనతో ఇంతవరకూ దూరంగా ఉన్న వారిని ప్రధాన స్రవంతిలో భాగం చేశామన్నారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు పొందిన వారిలో 50 శాతం మంది మహిళలేనన్నారు. భారత్ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది మహిళలు కీలక పాత్ర వహించారని, మహిళను శక్తిగా భారతీయులు విశ్వసిస్తారని చెప్పారు. హైదరాబాద్ నగరం సైనా నెహ్వాల్, పివి సింధు, సానియా మీర్జాలకు నిలయమన్నారు. అహల్యబాయ్ హూళ్కర్, ఝాన్సీలక్ష్మీభాయ్ వంటి వారు భారతీయ మహిళా
శక్తికి ప్రతీకలన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అమెరికా నుంచి అంతరిక్షానికి వెళ్లినా వారి పునాదులు భారత్‌లోనివేనని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో 50 శాతం భాగస్వామ్యం మహిళలదేనని వివరించారు. గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాలు, లిజ్జత్ పాపడ్‌లు మహిళాశక్తికి నిదర్శనంగా అభివర్ణించారు. పబ్లిక్ ఫైనాన్స్ విధానాలకు కౌటిల్యుడి అర్థశాస్తమ్రే పునాది అని, భారత్ మార్స్ మిషన్‌లో కూడా మహిళలదే కీలక పాత్ర అన్నారు. చరకసంహిత ద్వారా ఆయుర్వేదం, యోగలను ప్రపంచానికి అందించింది భారతదేశమేనని అన్నారు. ప్రతి ఏటా జూన్ 21న యావత్ ప్రపంచం యోగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ డాటా బేస్ ఆధార్‌ను తీసుకువచ్చామని అన్నారు. పారిశ్రామిక సదస్సు పెట్టుబడిదారులను, వ్యవస్థాపకులను, విద్యావేత్తలను, వివిధ రంగాల నిపుణులను ఒకే చోటుకు చేర్చిందని అన్నారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి 87 నిబంధనలను సవరించాం అని అన్నారు. దివాలా సంస్థల చట్టాన్ని బలోపేతం చేశామని, ముద్ర పథకం కింద 4.82 లక్షల కోట్లను మంజూరు చేశామని, వర్శిటీలు, ఇతర సంస్థల్లో 19 ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలోని నాలుగు చారిత్రక, పురాతన హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలే కొనసాగుతున్నారని చెప్పారు.
ఇవాంకకు విలువైన కానుక
నగరంలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్‌కు ప్రధాని నరేంద్రమోదీ విలువైన కానుక అందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునరావృత్త నమూనాలతో కూడిన మైక్రోమోజాయిక్ బాక్స్‌ను ప్రధాని అందజేశారు. అత్యంత నైపుణ్యంతో తయారుచేసిన ఈ బాక్స్‌ను ప్రధాని సూరత్ నుండి తెప్పించారు.

చిత్రం..హైటెక్స్‌లోని హెచ్‌ఐసిసిలో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న మోదీ
*
నగర ప్రజల సౌభాగ్యం
ధగధగలాడగ ప్రధాని తారిఫ్ జేసెన్
ప్రగతికి ప్రేరణనిచ్చెడి
బిగువగు మాటల ఇవాంక భేషనిపించెన్