జాతీయ వార్తలు

‘పద్మావతి’పై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: హిందీ చలనచిత్రం ‘పద్మావతి’ విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ వేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపిస్తూ, ‘పద్మావతి’ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపైన, ఇతరులపైన పరువు నష్టం, సినిమాటోగ్రఫీ చట్ట ఉల్లంఘన కింద కేసుల నమోదు చేసి సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు. ధర్మాసనంలోని ఇతర సభ్యులు ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్ కూడా పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. సెన్సార్ ధ్రువీకరణ ఇవ్వని సినిమా విషయమై తాము ముందస్తు తీర్పు ఇవ్వలేమన్నారు. ‘పద్మావతి’ కేసు విషయమై ఉన్నత స్థానంలో వారిపట్ల దురుద్దేశాలు ఆపాదించడం పట్ల పిటిషనర్‌పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదల అంశం ఇంకా సెన్సార్ బోర్డు పరిధిలోనే ఉందని కోర్టు గుర్తుచేసింది.