జాతీయ వార్తలు

ఏ మతమూ నీదంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: గుజరాత్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని బుధవారం సందర్శించినపుడు తాను హిందువును కాదంటూ అక్కడి రిజిస్టర్‌లో సంతకం చేశారు. అలా ఆయన సంతకం చేయడం ఇపుడు వివాదానికి కారణమైంది. హిందువులు కానివారు ఎవరైనా సోమనాథ్ ఆలయంలోకి ప్రవేశించినపుడు అక్కడి రిజిస్టర్‌లో సంతకం చేయడం తప్పనిసరి. అయితే, రాహుల్ గాంధీ తాను హిందువును కాదంటూ సంతకం చేయడంతో భాజపా నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. కాగా, ఆలయ రిజిస్టర్ రాహుల్ పేరిట ఎంట్రీ ఉందన్నది అభూత కల్పన అని, సామాజిక మీడియాలో ఆ ఎంట్రీకి సంబంధించిన ఫొటో నిజం కాదని కాంగ్రెస్ పార్టీ వివరించింది. ఆలయాన్ని సందర్శించినట్లు రాహుల్ సంతకం చేసినట్లు ఒక రిజిస్టర్ మాత్రమే ఉందని, ఇందుకు భిన్నంగా రిజిస్టర్ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు.
తాను హిందువును కాదంటూ రాహుల్‌గాంధీ ఎట్టకేలకు అంగీకరించినట్టయిందని బీజేపీ ఐటి విభాగం అధిపతి అమిత్ మాలవ్య ట్వీట్ చేశారు. విశ్వాసాలపరంగా హందువుకానని అంగీకరించిన రాహుల్, ఎన్నికల సమయంలో ఆలయాలను సందర్శిస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం తాను హిందువునని రాహుల్ పేర్కొన్నారని మాలవ్య గుర్తుచేశారు.
సోమనాథ్ ఆలయం రిజిస్టర్‌లో రాహుల్ సంతకం చేసినట్లు ఆయన మీడియా సమన్వయకర్త మనోజ్ త్యాగి వెల్లడించారన్న కథనాలు వెలువడ్డాయి. రాహుల్ వెంట వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పేరు కూడా రిజిస్టర్‌లో ఉందని త్యాగి ప్రస్తావించారని వార్తలు వచ్చాయి. అయితే, రాహుల్‌వెంట మీడియా ప్రతినిధులను ఆలయంలోకి తీసుకువెళ్లడానికి తాము మాత్రమే రిజిస్టర్‌లో సంతకం చేశానని, అందులో రాహుల్, అహ్మద్ పటేల్ పేర్లు లేవని మనోజ్ వివరణ ఇచ్చారు. తాము వెళ్లిపోయాక ఎవరో వ్యక్తులు రిజిస్టర్‌లో రాహుల్, అహ్మద్ పటేల్ పేరిట సంతకాలు చేసి ఉంటారని అన్నారు.
ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ గాంధీ ఆలయాలకు వెళ్లడం భాజపాకు ఓ సమస్యగా మారింది.. కుళ్లు రాజకీయాలలో దేవుళ్ల ప్రస్తావన తీసుకురావద్దు..’ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాక రాహుల్ ఇప్పటికి ఆరుసార్లు ప్రచారం నిమిత్తం వచ్చారు. ప్రచారం
సందర్భంగా రాహుల్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆలయాలకు సైతం వెళుతున్నారు. ఈ నెల ఆరంభంలో ఆయన గాంధీనగర్‌లోని స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని, అంబాజీ ఆలయాన్ని, సెప్టెంబర్‌లో ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించారు. హిందూ ఓట్ల కోసమే రాహుల్ గుడులకు వెళుతున్నారని భాజపా ఆరోపిస్తోంది. ‘ఎన్నికల ముందు రాహుల్ ఎందుకిలా ఆలయాలకు వస్తున్నారు? అతని ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలుసు.. గతంలో గుజరాత్‌కు వచ్చినపుడు ఆయన ఏ ఆలయానికీ వెళ్లలేదు..’ అని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. ‘కుహనా లౌకికవాదం ముసుగులోనైనా ఈ దేశంలో అతిముఖ్యమైన హిందుత్వను కాంగ్రెస్ గౌరవించడం మంచిదే.. అయితే వారి జిమ్మిక్కులు ఓటర్ల ముందు ఏ మాత్రం పనిచేయవు..’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ ఆలయాలకు వెళ్లడాన్ని భాజపా వివాదాస్పదం చేయడంతో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేతలు ప్రతిదాడికి దిగారు. భక్త్భివానికి ఎవరైనా ‘పేటెంట్ హక్కు’ కలిగి ఉంటారా? ఆలయానికి వెళితే విమర్శలు ఎందుకు? అని వారు ధ్వజమెత్తారు. రాహుల్ హిందూ ఆలయాలకే కాదు, జైన ఆలయాలకు, గురుద్వారాలకు వెళ్లారని, తమకు లౌకికవాదం పట్ల పూర్తి నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత శక్తిసింహ్ గోహిల్ అన్నారు.
*
ఓట్ల కొరకు రాహుల్ పలు
పాట్లు పడుచు భక్తితోడ భంభం అన్నా
గాట్లుపడెను మతమునకని
కోట్లాదిమనములుకుంద కోపం వచ్చెన్!
*
చిత్రం..సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ