జాతీయ వార్తలు

తలచుకుంటే మీరే లీడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 29: 20వ శతాబ్దపు ఆరంభంలో దేశ పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు మార్గదర్శిగా నిలిచిన పశ్చిమబెంగాల్, తన పాటవాన్ని మళ్లీ పొదివిపట్టుకోవడానికి ఇంకా మార్గాలు మూసుకుపోలేదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో వేళ్లూనుకుంటున్న డిజిటల్ టెక్నాలజీ రూపంలో రాష్ట్రానికి మరో అవకాశం కనిపిస్తోందని గుర్తు చేశారు. అత్యుత్తమ శాస్త్ర, సాంకేతిక విద్యా కేంద్రాలు కలిగిన పశ్చిమ బెంగాల్, తాను తలచుకుంటే దేశంలో పోటెత్తుతోన్న ఐటీ విప్లవానికి నాయకత్వం వహించడం పెద్ద కష్టం కాదని పిలుపునిచ్చారు. బోస్ ఇనిస్టిట్యూట్ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన రాష్టప్రతి కోవింద్ కీలక ఉపన్యాసం చేశారు. ‘కారణాలు ఏమైనా కావొచ్చు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, గమనం రాష్ట్రంలో మందకొడిగా ఉన్నాయన్న మాట నిజం. అయితే, ఉన్న వనరులు వినియోగించుకుంటూ, ఎదురొస్తున్న అవకాశాలను సమర్థంగా వాడుకుంటే పశ్చిమ బెంగాల్ మళ్లీ మునుపటి ప్రాధాన్యతను సంతరించుకోగలదని అన్నారు. ‘డిజిటల్ టెక్నాలజీ ప్రగతి పయనంలో మనం మధ్యలోవున్నాం. ఈ సమయంలో సరైన ప్రణాళికలు అమలు చేస్తే, ఐటీ విప్లవానికి నాయకత్వం వహించగల అవకాశాలు బెంగాల్ కళ్లముందే ఉన్నాయి’ అంటూ కోవింద్ చైతన్యపర్చారు. ‘ఉత్పాదక రంగం, బయో ఇన్ఫర్మాటిక్స్‌లో ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. రోబోటిక్స్‌తో జీవన విధానంలోనే పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులే బెంగాల్‌కు ప్రధాన అవకాశాలు. శాస్తర్రంగానికి పెద్దపీట వేస్తూ వస్తున్న బెంగాల్‌లో యువ శాస్తవ్రేత్తలకు కొదువలేదు. సానుకూల అంశాలను సద్వినియోగం చేసుకుంటూ, ఒక తాటిపై నడిస్తే ఐటీ విప్లవానికి నాయకత్వం వహించే స్థానానికి బెంగాల్ చేరుకోగలదు. ఇది పెద్ద కష్టమైన పని కాదు’ అని కోవింద్ స్పష్టం చేశారు. తరంగ సమాచార ప్రవాహ ప్రక్రియను రూపొందించి సాంకేతికతో విప్లవాత్మక మార్పులకు తావిచ్చిన వైతాళిక శాస్తవ్రేత్త ఆచార్య జగదీష్ చంద్రబోస్ చూపిన మార్గంలో పయనించి, సరికొత్త ఆవిష్కరణలకు బెంగాల్ నాందీవాచకం పలకాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 20వ శతాబ్దపు దేశ రాజధానిగా కోల్‌కతాను ప్రస్తావిస్తూ, భౌతిక, రసాయిన, వైద్య, ఔషధ రంగాల్లో ఇక్కడ జరిగిన పరిశోధనలు అంతర్జాతీయస్థాయిని అందుకున్నాయని గుర్తు చేశారు. ‘శాస్త్ర, ఇంజనీరింగ్ విద్యకు కోల్‌కతా ప్రధాన కేంద్రం. దేశంలో ఎక్కడ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులైనా, కోల్‌కతాను సందర్శించకుంటే తమ విద్యను పూర్తి చేసినట్టు కాదు’ అంటూ చారిత్రక హౌరా బ్రిడ్జిని ప్రస్తావించారు. దేశంలో సివిల్ ఇంజనీరింగ్ తన కాళ్లమీద తాను నిలబడిందని చెప్పడానికి కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జిని ఉదహరించాలని అంటూ, స్వదేశీ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా అభివర్ణించారు. ‘లేబొరేటరీలకే శాస్త్రం పరిమితం కాకూడదని కోల్‌కతా శాస్తవ్రేత్తలు నిరూపించారు. బలమైన దేశ నిర్మాణం కోసం ముందుతరం శాస్తవ్రేత్తలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి అద్భుతాలు చేసి చూపించారు. వాళ్ల ఆలోచనా మార్గం అనుసరణీయం’ అని కోవింద్ ఉద్ఘాటించారు.
బెంగాల్ కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ కేంద్రాన్ని నెలకొల్పిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్‌ని గుర్తు చేస్తూ, బెంగాల్ శాస్తవ్రేత్తలు, సాంకేతిక నిపుణులు పారిశ్రామికంగానూ ఎన్నో విజయాలు సాధించారన్నారు. ఆ పరిస్థితి మళ్లీ ఇప్పుడు బెంగాల్‌లో చోటుచేసుకోవాలని రాష్టప్రతి కోవింద్ ఉద్భోదించారు.

చిత్రం..బోస్ ఇనిస్టిట్యూట్ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్టప్రతి కోవింద్