జాతీయ వార్తలు

అత్యాచారం కేసులో ముగ్గురికి ఉరిశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మద్‌నగర్, నవంబర్ 29: మహారాష్టల్రోని కోపార్డి గ్రామంలో గత ఏడాది పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసినందుకు ముగ్గురు నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్షను విధించింది. కోర్టు అదనపు స్పెషల్ జడ్డి సువర్ణా కెవలె ఈ మేరకు బుధవారం తీర్పును ప్రకటించారు.
అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలపై నిందితులైన జితేంద్ర బాబూలాల్ షిండే (25), సంతోష్ గోరఖ్ భవాల్ (30), నితిన్ గోపీనాథ్ భైలుమె (23)లకు మరణదండనను కోర్టు ఖరారు చేసింది. ఈ ముగ్గురికీ మరణశిక్ష విధించడంతో ఈ రోజు తమకు న్యాయం జరిగిందని బాలిక తల్లి పేర్కొంది. నేరస్వభావం గల వారందరికీ ఈ తీర్పు ఓ ‘ప్రతిబంధకం’గా ఉంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వ్యాఖ్యానించారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న బాధితురాలి మృతదేహాన్ని 2016 జూలై 13న అహ్మద్‌నగర్ జిల్లా కొపార్డి గ్రామ సమీపంలో స్థానికులు కనుగొన్నారు. అత్యాచారం చేసినపుడు తీవ్రంగా గాయపరచడమే గాక, హత్యచేసిన అనంతరం ఆమె శరీరాన్ని నిందితులు ఛిద్రం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మరాఠాలు ఆందోళన చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని వౌన ప్రదర్శనలు జరిపారు. నిందితులు మరో సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ ఘటన రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. మహారాష్టల్రోని అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమించారు. విపక్ష కాంగ్రెస్, ఎన్‌సిపి నేతలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 26/11 ముంబయి పేలుళ్లు వంటి అనేక కీలక కేసుల్లో నికమ్ ప్రాసిక్యూషన్ బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న అహ్మద్‌నగర్ పోలీసులు నిందితులపై వివిధ నేరారోపణలతో 350 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. నిందితులకు మరణశిక్ష విధించడంతో తన కుమార్తెకు న్యాయం జరిగిందని బాధితురాలి తల్లి ప్రభుత్వానికి, పోలీసులకు, న్యాయస్థానానికి, మరాఠా సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపింది. అత్యాచారం, హత్య జరగడానికి కొద్దిరోజుల ముందు నిందితులు ఆ బాలికను అడ్డగించి వేధించగా ఆమె అడ్డుకుందని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వివరించారు. పథకం ప్రకారమే నిందితులు ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని ఆయన కోర్టుకు తెలిపారు. 31 సాక్ష్యాలను పరిశీలించాక కోర్టు వీరికి మరణశిక్షను విధించింది.