జాతీయ వార్తలు

‘వాతావరణ మార్పుల’కు భారత్ కారణం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: వాతావరణంలో మార్పులకు భారత్ కారణం కాదని, నిజానికి ఆ విపరిణామాలతో సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ‘పారిస్ ఒప్పందం’ నుంచి కొన్ని దేశాలు వైదొలగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పారిస్ ఒప్పందాని’కి అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుండగా ‘కొన్ని దేశాలు’ ఇందుకు సహకరించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పారిస్ ఒప్పందం నుంచి తమ దేశం తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ గత జూన్‌లో ప్రకటించడమే గాక, ఆ ఒప్పందం ఫలితంగా భారత్, చైనా వంటి దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. కర్బన ఉద్గారాల విషయంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్ సహా మరో 190 దేశాలు 2015 డిసెంబర్‌లో ఒక ఒప్పందానికి అంగీకరించాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గించాలన్నది ఆ ఒప్పందంలో కీలక అంశం. భారత్ ఒక మంచి ఒప్పందంలో భాగస్వామిగా మారిందని, అదే అత్యుత్తమ విధానం కానప్పటికీ కొన్ని దేశాలు పారిస్ ఒప్పందాన్ని ప్రశ్నించడం బాధాకరమని సురేశ్ ప్రభు అన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఉత్పత్తులకు తగిన మార్కెట్ ఉండాలన్నారు. వాతావరణ సమస్యలను అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని, ఇందుకు టెక్నాలజీ మార్పిడి, పరస్పర సహకారం అవసరమని ఆయన వివరించారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంస్థ’ (ఐఎఫ్‌సీ) ప్రైవేటు పెట్టుబడుల సమీకరణకు సరికొత్త వ్యూహాలను అమలు చేసి, వాతావరణ మార్పుల దుష్ఫలితాలను నివారించే పథకాలకు సహకరించాలన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పారిశ్రామిక విధా నం వల్ల మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందన్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి రాబోయే ఏడెనిమిదేళ్లలో మరింత పుంజుకుంటుందన్నారు. ఉత్పత్తిరం గం విస్తరణకు అనువైన పరిస్థితులు భారత్‌లో ఉన్నాయన్నారు. అర్జెంటీనాలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో సురేశ్ ప్రభు దేశంలో ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక ప్రగతి గురించి మీడియాకు వివరించారు.