జాతీయ వార్తలు

ఔను! మీవి ‘దోపిడీ’ ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్బీ, నవంబర్ 29: వస్తు సేవల పన్ను (జిఎస్టీ) గబ్బర్ టాక్స్‌గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అంతే తీవ్రతతో విరుచుకుపడ్డారు. దేశాన్ని దోచుకున్న వ్యక్తులు కేవలం బందిపోట్లు గురించే ఆలోచిస్తారని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి అగ్రనేతల మధ్య పరస్పర విసుర్లుతో కూడిన వాగ్యుద్ధం పరాకాష్టకు చేరుకుందని చెప్పడానికి ఈ తాజా పరిణామం నిదర్శనం. మొదటినుంచీ కూడా జిఎస్టీ విషయంలో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను గుర్తు చేసిన మోదీ ‘జిఎస్టీ ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల చర్య’గా అభివర్ణించారు. అలాగే ఇటీవలే తానొక ‘ఆర్థికవేత్త’నంటూ కిరీటం తగిలించుకున్న వ్యక్తి జిఎస్టీని అర్థంలేని చర్యగా అభివర్ణిస్తున్నారని, మొత్తం రేటునే గరిష్టంగా 18 శాతానికి నిర్ణయించాలని సూచిస్తున్నారని మోదీ అన్నారు. జల సంరక్షణ, వ్యవసాయం, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మోదీ వివరించారు. బుధవారం జరిగిన ఓ భారీ ర్యాలీలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ కేవలం స్వల్పకాలిక పథకాలనే చేపట్టిందని, నర్మద ప్రాజెక్టు సహా బిజెపి భారీ అభివృద్ధి కార్యక్రమాలనే అమలు చేసిందని తెలిపారు. పటేదార్ వర్గం బలంగా ఉన్న ఈ ప్రాంతంలో బిజెపికి ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చిన మోదీ, తమ పార్టీ వందేళ్ల వరకూ అధికారంలోనే ఉంటుందన్నారు. కొత్తగా ఆర్థికవేత్తలుగా భుజకీర్తులను తగిలించుకున్న కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. తమ జీవితకాలమంతా ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వ్యక్తులకు, దోపిడీదారులు తప్ప ఇంకెవరు గుర్తొస్తారని అన్నారు. జిఎస్టీ పన్నును 18శాతానికి కుదించాలన్న ప్రతిపాదనను ప్రస్తావించిన మోదీ ‘దీన్నిబట్టి చూస్తే, ఉప్పుపైనా 18శాతం పన్ను, ఐదు కోట్ల విలువచేసే లగ్జరీ కార్లపైన 18 శాతం పనే్న వేస్తారన్న మాట’ అని అన్నారు. ఇదెక్కడి ఉత్తమ ఆలోచనో తనకు అర్థంకావడం లేదని, ఇలాంటి ఆర్థికవేత్త కొత్తగా తెరపైకి వచ్చాడని రాహుల్‌ను పరోక్షంగా దుయ్యబట్టారు.
బట్టలు, చెప్పులు, ఆహారపదార్థాలను భారంగా, సిగరెట్లు, లిక్కర్‌ను చౌకగా మార్చాలన్నదే ఈ ఆర్థికవేత్త ఆలోచనగా కనిపిస్తుందన్నారు. సిగరెట్ల రేట్లు తగ్గించడం అంటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని అందరి ఇళ్లకూ చేర్చడమే అవుతుందని పేర్కొన్న మోదీ ‘లిక్కర్ రేటును తగ్గించడం ద్వారా ఏ వ్యాపారవేత్తకు ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రయోజనం కలిగించాలని అనుకుంటున్నాడు’ అని ప్రశ్నించారు.
చిత్రం..బుధవారం జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ