జాతీయ వార్తలు

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే బిజెపికి అచ్ఛే దిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీని త్వరలోనే పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయడం అంటే బిజెపికి ‘అచ్ఛేదిన్’(మంచిరోజులు) రావడమే’అని ఒక ఇంగ్లీషు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ మరో 15 సంవత్సరాలు ప్రధానిగా కొనసాగుతారని కూడా స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారంటూ బుధవారం మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. అయితే పార్టీ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. చివరికి తన సొంత నియోజకవర్గం రాయబరేలి పర్యటనలో ఉన్న సోనియా గాంధీ సైతం ఈ అంశంపై పెదవి విప్పలేదు.