జాతీయ వార్తలు

త్యాగాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ సంక్షేమం, ప్రగతి కోసం రాజకీయంగా ఎంతటి మూల్యాన్నైనా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవస్థీకృత మార్పులను తీసుకొచ్చే విషయంలో ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని పేర్కొన్న ఆయన, తమ ప్రభుత్వం తిరుగులేని నిర్ణయాలనే తీసుకుంటూ వస్తోందని 15వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిపక్ శిఖరాగ్ర సదస్సులో స్పష్టం చేశారు. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించి ఎన్డీయే అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో అన్ని వ్యవస్థలూ అస్థవ్యస్థంగా ఉన్నాయన్నారు. భారత దేశం అత్యంత బలహీన దేశాల్లో ఒకటిగా ఉండేదని, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, పాలనా విధానం కూడా అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. కానీ, అధికారంలోకి వచ్చిన అనతికాలంలో మొత్తం పరిస్థితిని ఆమూలాగ్రం ప్రక్షాళన చేసి తిరుగులేని మార్పులు తీసుకొచ్చిందని, ఆ విధంగా భారతావనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందన్నారు. అనేకరంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడించిన ఆయన, అవినీతి నల్లధనం నిరోధనకు తీసుకున్న కఠిన చర్యల గురించి ఈ సందర్భంగా వివరించారు. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత పదును పెట్టామని, పాలనా వ్యవస్థనూ పరుగులు పెట్టిస్తున్నామని, అంతిమంగా సామాన్యుల జీవనంలో గుణాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. ‘నేను తీసుకున్న ఈ నిర్ణయాలకు భారీగానే రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం నాకు తెలుసు. నేనెంచుకున్న మార్గం, దేశాన్ని ఏ లక్ష్యం దిశగా తీసుకెళ్లాలనుకున్నానో అవన్నీ కూడా ప్రత్యర్థులకు ఎంతమాత్రం గిట్టనివే. కానీ, ఏ విషయంలోనూ వెనుకడుగు వేయను’ అని ఉద్ఘాటించారు. యూపీఏ నుంచి ఎన్డీయేకు వారసత్వంగా వచ్చిన ఆధ్వాన్న పరిస్థితులు, పరిణామాలను విశే్లషించిన ఆయన, మొత్తం దేశంలోనే ప్రవర్తనాపరమైన మార్పును తాము తీసుకురాగలిగామని, ఇందుకు పెద్దనోట్ల రద్దు విశేష రీతిలోనే దోహదం చేసిందన్నారు. ఈ నిర్ణయాలన్నీ కూడా దేశాన్ని దోచుకుని తిన్నవారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినవేనని, అందుకే అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారన్నారు. ద్రవ్యపరమైన లావాదేవీలు అన్నింటినీ సాంకేతిక డిజిటల్ ప్రక్రియ ద్వారా నిర్వహించుకునే స్థాయిని భారతదేశం సంతరించుకునే రోజున అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని స్పష్టం చేశారు. బ్యాకింగ్ వ్యవస్థలోకి వచ్చిన నల్లధనంతోపాటు అనంతమైన డేటా కూడా అందుబాటులోకి వచ్చిందని, దీని ఆధారంగా అక్రమార్కుల గుట్టు రట్టు చేయడం ప్రభుత్వానికి మరింత సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు సమాంతర ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిచ్చిన ఈ అక్రమ సంపద, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయిందని పేర్కొన్న మోదీ, వ్యవస్థాగతంగా శాశ్వత మార్పులను తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ ధ్రుడ సంకల్పమని, ఈ విషయంలో తమకు ఎవరూ ఆపలేరని తెలిపారు. దేశ హితమే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఉద్ఘాటించిన ఆయన ‘మంత్రదండం ఉంటే తప్పిస్తే దేశ స్థితిగతులు మారవని భావించిన వారికి తాజా పరిస్థితులు తీవ్ర నైరాశ్యాన్ని, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి’ అన్నారు. వస్తు సేవల పన్ను ద్వారా దేశంలో సరికొత్త పారదర్శకతను పాదుగొల్పామని స్పష్టం చేశారు. నాటి యూపీఏ విధాన చచ్చుబాటుతనం గురించి మాట్లాడిన మోదీ ‘మేం అధికారంలోకి వచ్చినపుడు మాకు వారసత్వంగా లభించింది ఏమిటి?’ అని ప్రశ్నించారు.