జాతీయ వార్తలు

ఐదుగురు మిలిటెంట్లు ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 30: కాశ్మీర్‌లోని బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు మృతిచెందారు. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనగర్‌కు 45 కి.మీ దూరంలోని ఫుత్లిపోరాలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో తారసిల్లిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరేలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక మిలిటెంట్ మరణించాడు. ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా జరుగుతున్నట్లు సమాచారం. ఇలావుండగా భద్రతా దళాలు జరుపుతున్న తనిఖీల్లో కొంతమంది యువకులు రాళ్లు రువ్విన సంఘటనలో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
2017లో 200మంది హతం
* జమ్మూకాశ్మీర్ డీజీపీ వెల్లడి
గత ఏడేళ్లలో మొదటిసారి జమ్మూకాశ్మీర్‌లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 200 మందికి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు రాష్ట్ర డీజీపీ ఎస్‌పీ వాయిద్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు, సైన్యం, సీఆర్‌పీఎఫ్, ప్రజలు కలిసి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 200 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు డీజీపీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో గురువారం పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
కాశ్మీర్‌లోని బుడ్గాం, బారాముల్లా జిల్లాల్లో గురువారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమైన తరువాత డీజీపీ ఈ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పడంలో ఇదో పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు అప్రమత్తమవుతున్న దృశ్యం