జాతీయ వార్తలు

స్వల్పకాలిక యోగా కోర్సులు చేసే విదేశీయులకు టూరిస్టు, ఇ-వీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: యోగ విద్యను ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా యోగ విద్యలో స్వల్పకాలిక కోర్సు చేయడానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసా, ఇ-టూరిస్టు వీసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగా ప్రాధాన్యతను ప్రపంచమంతా గుర్తిస్తూ ఉండడాన్ని గ్రహించిన ప్రభుత్వం స్వల్పకాలిక యోగా కోర్సుకు హాజరు కావడాన్ని, భారతీయ వైద్య విధానాల్లో స్వల్పకాలిక చికిత్స తీసుకోవడానికి రావడాన్ని ఇ-టూరిస్టు వీసా కింద అనుమతించబడే కార్యకలాపాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక యోగా కార్యక్రమాలను టూరిస్టు వీసా, ఇ-టూరిస్టు వీసాలలో చేర్చాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రస్తుతం విహార యాత్ర, సైట్ సీయింగ్, లేదా స్నేహితులు, బంధువులను కలుసుకోవడానికి, స్వల్పకాలిక వైద్య చికిత్స కోసం లేదా మామూలు వ్యాపార సందర్శన కోసం వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసాను మంజూరు చేస్తున్నారు. కాగా తాజా నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవాలని విదేశాల్లోని అన్ని భారత దౌత్య కార్యాలయాలను,విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారులను, విదేశీయుల రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించినట్లు ఆ అధికార ప్రతినిధి చెప్పారు.
దేశంలోకి వచ్చిన తర్వాత వీసా జారీ చేసే విధానం (వీసా ఆన్ అరైవల్), అలాగే ఇ-టూరిస్టు వీసా పథకంగా పిలవబడే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఇటిఏ) పథకాన్ని 2014లో ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ పథకం కింద మనదేశాన్ని సందర్శించడానికి వీసాకోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు దేశాన్ని సందర్శించడానికి అనుమతిస్తూ ఒక ఇ-మెయిల్ ఆథరైజేషన్ అందుతుంది. దాన్ని అధికారికంగా ఆమోదించిన తర్వాత కానీ లేదా దాని ప్రింటవుట్‌తో కాని వాళ్లు మన దేశానికి రావచ్చు. మన దేశానికి చేరుకున్న తర్వాత సందర్శకుడు ఆ ప్రింటవుట్‌ను ఇమిగ్రేషన్ అధికారులకు ఇస్తే వారు అతడ్ని దేశంలోకి అనుమతిస్తూ దానిపై స్టాంప్ వేస్తారు. ఇప్పటివరకు ఈ పథకాన్ని 150 దేశాలకు విస్తరించడం జరిగింది. ఇ-టూరిస్టు వీసాను జారీ చేయడానికి దేశంలోని 16 విమానాశ్రయాలను అధికారికంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వీసాలను మంజూరు చేశారు.