జాతీయ వార్తలు

వక్ఫ్ ఆస్తులను వదలిపొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీలో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖ నడుం బిగించింది. సెంట్రల్ ఢిల్లీలోని దార్యాగంజ్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన 875 ఆస్తులను గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలని కొత్వాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. ఆక్రమణకు గురైనవాటిలో మీర్‌దార్ద్ రోడ్‌లోని తకియా కాలేఖాన్ స్మశాస వాటిక కూడా ఉండటం విశేషం. 1955 ఢిల్లీ వక్ఫ్ చట్టం ప్రకారం నోటీసులు జారీచేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నోటీసుల అనంతరం 15 రోజుల గడువిచ్చి ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ఒక్క కొత్వాలి సబ్ డివిజన్‌లోనే 457 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మిగతా వారంతా దార్యాగంజ్ సబ్‌డివిజన్‌లోనివారేనని అన్నారు. 1955 వక్ఫ్ చట్టం సెక్షన్ 55 ప్రకారం దార్యాగంజ్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ నోటీసు జారీ చేసిన 288 ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరికొందరికి 1995 ఢిల్లీ వక్ఫ్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డు అధికారుల వివరాల ప్రకారం ఢిల్లీ పరిసరాల్లోని దాదాపు 2వేల ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి. వాటిలో స్మశానవాటికతోపాటు భవనాలు, షాపులు, స్థలాలు ఉన్నాయి.