జాతీయ వార్తలు

ఇదేనా విద్యకు మీరిచ్చే ప్రాధాన్యత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నల పరంపర సాగుతోంది. శనివారం తాజాగా నాలుగో ప్రశ్న సంధించారు. ‘గుజరాత్ రాష్ట్రానికి మీరేం చేశారు? విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనా? విద్యకు అత్యల్పంగా నిధులు వెచ్చించారు. ఇదేనా మీ ప్రభుత్వంలో విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత?’ అని రాహుల్ నిలదీశారు. గుజరాత్ యువత ఏం తప్పుచేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ట్వీట్ సంధించారు. గుజరాత్ ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోదీకి రోజుకో ప్రశ్న సంధిస్తానని యువనేత వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మీరు విద్యకు నిధులు కేటాయించలేదు. అందుకే 26వ స్థానంలో ఉంది’ అని రాహుల్ నిప్పులు చెరిగారు. మోదీ విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. చదువుకుందామంటే ఫీజులు ఆకాశానంటాయని, ఇదంతా బీజేపీ చలవేనని రాహుల్ విమర్శించారు. ఇదేనా నవభారతం? అని ఆయన ప్రశ్నించారు. 22 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ అన్ని రంగాల్లోనూ వెనకబడి పోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు. నిధుల దుర్వినియోగం విచ్చలవిడిగా సాగిపోయిందని అన్నారు. ప్రజాసొమ్మును ప్రవేటు పవర్ కంపెనీలకు ధారబోసారని రాహుల్ తెలిపారు.