జాతీయ వార్తలు

బ్యాలెట్ పెడితే.. బీజేపీ గల్లంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 2: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తొలగించి బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తే బీజేపీ ఓటమి చెందడం ఖాయమని బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో బీఎస్పీ నిలిచింది. నవంబర్ 30న పరమపదించిన ప్రముఖ బౌద్ధ సన్యాసి భదంత్ ప్రజ్ఞానందకు నివాళులు అర్పించిన అనంతరం మాయావతి విలేఖరులతో మాట్లాడారు. 2019లో జరిగే ఎన్నికల్లో బ్యాలట్ పేపర్లు మళ్లీ ప్రవేశపెడిటే బీజేపీ పరాజయం పాలుకావడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అయినప్పటికీ తమ పార్టీకి అన్ని వర్గాలవారు మంచి మద్దతు తెలిపారని మాయావతి అన్నారు. లేకుండా మరిన్ని స్థానాల్లో గెలిచివుండేవారమని తెలిపారు. యూపీలో పొత్తుల గురించి విలేఖరులు ప్రస్తావించగా- తమ పార్టీకి సర్వ సమాజ్ అంటే దళితులు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, ఉన్నత కులాల వారు మద్దతు తెలుపుతున్నారని, ఇంతకంటే పొత్తులు ఇంకేముంటాయని అన్నారు.

చిత్రాలు..ప్రముఖ బౌద్ధ భిక్షువు భదంత్ ప్రజ్ఞానంద మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి