జాతీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారిగా ఉన్న ముళ్లపల్లి రామచంద్రన్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు డిసెంబరు నాలుగు ఆఖరు తేదీకాగా, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ తప్ప, మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే, ఎన్నిక లేకుండానే రాహుల్ అధ్యక్షుడిగా ఎంపికవుతారు. దేశవ్యాప్తంగా అన్ని పిసిసిలు రాహుల్ అభ్యర్థిత్వానికే మద్దతు తెలియచేస్తుడటంతో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం ఖాయం. శనివారంనాడు కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అధ్యక్ష పదవికి రాహుల్ అభ్యర్ధిత్వాన్ని బలపరిచారు. అనంతరం హనుమంతురావు విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాల గురించి పట్టించుకోని చాలామంది నాయకులు రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతను ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌పై మహారాష్ట్ర పీసీసీ కార్యదర్శి షెహజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విమర్శలు చేసే నాయకులు దమ్ముంటే పోటీలో నిలబడాలని సవాల్ చేశారు. ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న ఈ సమయంలో గాంధీ కుటుంబానికి మాత్రమే అధ్యక్ష పదవి ఇస్తున్నారని వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు.

చిత్రం..హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ కోసం భారత్‌కు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలుసుకున్నప్పటి చిత్రం.