జాతీయ వార్తలు

నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: బొగ్గు కుంభకోణంలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని జస్టిస్ ఎం.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన త్రిసభ్య బెంచ్ ఆదేశించింది. బొగ్గు కుంభకోణంలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 23న సిట్‌ను నియమించిన విషయం విదితమే. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన విచారణను ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా యత్నించారన్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు సిట్‌ను నియమించింది. సిట్‌ను నియమించి చాలాకాలమైందని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కోర్టుకు నివేదించాలని త్రిసభ్య బెంచ్ సిట్‌ను ఆదేశించింది. కాగా, బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఎనిమిది కేసులు సిబిఐ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఆర్.ఎస్.చీమా కోర్టుకు నివేదించారు. అయితే ఈ కేసుల విచారణను వచ్చే ఏడాది జనవరి 15లోగా ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది.