జాతీయ వార్తలు

లోక్‌పాల్ చట్టాన్ని నీరుగార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖజురహో (మధ్యప్రదేశ్), డిసెంబర్ 4: అవినీతి అంతానికి ఉద్దేశించిన లోక్‌పాల్ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. ‘చాలా అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం లోక్‌పాల్ చట్టాన్ని పలుచన చేశారు.. ఆ తర్వాత 2016 జూలై 27న ఆ చట్టాన్ని సవరించడం ద్వారా మోదీ కూడా అదే తీరులో వ్యవహరించారు.. ప్రభుత్వ అధికారుల కుటుంబ సభ్యులు ఏటా ఆస్తుల వివరాలను వెల్లడించకుండా సవరణ చేశారు..’ అని హజారే తెలిపారు. ఖజురహో పట్టణంలో ‘జల సమ్మేళనం’ సందర్భంగా హాజరైన ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల కుటుంబ సభ్యులంతా వారి ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించడం చట్టబద్ధం చేయాలన్నారు. లోక్‌పాల్ సవరణ బిల్లుపై ఎలాంటి చర్చ జరపకుండా ఒక్కరోజులోనే లోక్‌సభలో ఆమోదించారని, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి, మరుసటి రోజునే రాష్టప్రతి ఆమోదానికి పంపారని గుర్తు చేశారు. లోక్‌పాల్ చట్టంపైన, రైతుల సమస్యలపైన తాను ప్రధాని మోదీకి ఎన్ని లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదని హజారే తెలిపారు. చట్టానికి విరుద్ధంగా బ్యాంకు యాజమాన్యాలు పంట రుణాలపై రైతుల నుంచి చక్రవడ్డీ వసూలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అరవై ఏళ్లు నిండిన రైతులకు నెలకు 5వేల పెన్షన్ చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.