జాతీయ వార్తలు

నటుడంటే ను(న)వ్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరయ్యవ దశకం హిందీ సినిమాకు స్వర్ణయుగమే. అన్ని అద్భుతాలూ ఆ దశకంలోనే జరిగాయి. అన్ని కళాఖండాలూ ఆ పదేళ్ల కాలంలోనే. యావద్భారత ప్రేక్షకులను అలరించి ఇప్పటికీ అజరామరంగా నిలిచిపోయాయి. సంగీతం, పాటలు మధురాతి మధురాలుగా నిత్యాన్నందాన్ని ఇప్పటికీ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ దశకంలో.. ఓ పక్క రాజేంద్ర కుమార్, మరో పక్క ధర్మేంద్ర, ఇంకోపక్క రాజేష్ ఖన్నా.. ఇలా స్టార్ హీరోలు రాజ్యం మేలుతున్న తరుణంలో ‘్ధర్మపుత్ర’ ద్వారా అరంగేట్రం చేసిన శశికపూర్ ఓ అద్భుతమే. అందం, చందం, అభినయం మూర్త్భీవించుకున్న రూపంగా ప్రేక్షకుల మదిని దోచుకున్న ఆయన వాచకంలో ప్రత్యేకతను కనబరుస్తూ సంభాషణలు పలకడంలో తనదైన శైలినే బలంగా పాదుగొల్పారు. నటించింది తక్కువ సినిమాలే అయినా అన్నీకూడా వేటికవే సాటిగా ఇటు పాటలపరంగా, అటు కమనీయ సంగీత పరంగా అద్భుతంగా రాణించాయి. రాజ్‌కపూర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఆ మూసనుంచి బయటపడి నటుడిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ఎన్నో వైవిధ్యభరితమైన, విశిష్ఠమైన పాత్రలను పోషించి నాటి హీరోల పోటీని తట్టుకుని శశికపూర్ బలంగా నిలబడ్డాడు. సత్యం శివం సుందరం, జబ్ జబ్ ఫూల్ ఖిలే, దీవార్, సుహాగ్, నమక్‌హలాల్, కభీకభీ, ఆ గలే లగ్ జా, సిల్‌సిల, చోర్ మచాయే షోర్, కాలాపత్తర్, కన్యాదాన్, షాన్, హసీనా మాన్ జాయేగీ, వక్త్, ఉత్సవ్‌సహా అనేక బాలీవుడ్ చిత్రాలతోపాటు పలు ఆంగ్ల చిత్రాల్లోనూ నటించి పలు భిన్నమైన నటనా వైదుష్యాన్ని శశికపూర్ చాటిచెప్పారు. పాత్ర పోషణ ముఖ్యం కాని దాన్ని ఎంత వైవిధ్యంగా రక్తికట్టించామన్నదే ముఖ్యం. తనది ముఖ్యపాత్రా కాదా అన్నదానితో నిమిత్తం లేకుండా ముందుకు సాగిన నటుడు కాబట్టే మిగతా నటులెవరకీ రానంత ప్రత్యేక గుర్తింపు శశికపూర్‌కు లభించింది. ఏ హీరోకైనా ఓ ప్రత్యేకమైన ఒరఒడి ఉండాలి. తనదైన మేనరిజం ఉండాలి. అన్నింటికీ మించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగే రీతిలో పాత్రకు న్యాయం చేయగలిగే అభినయ సత్తా ఉండాలి. ఇవన్నీ శశికపూర్‌లో నూటికి నూరు శాతం ఉన్నాయని చెప్పడానికి ఏ విధంగానూ సందేహించాల్సిన అవసరం లేదు. తన సోదరుడు షమీకపూర్ డాన్స్‌ను అధిగమిస్తూ శశికపూర్ కూడా తనదైన రీతిలో రఫీ పాటలను రక్తికట్టించారు. డాన్స్ అంటే తెలియని నాటి హీరోలకు దాని రుచి చూపించాడు. అందుకే శశికపూర్ పాటల్లో ఓ ఉత్తేజం ఉంటుంది. రఫీ పాడినా, కిషోర్ పాడినా ఆ పాట భావ స్ఫోరకతను తన అభినయంతో అభివ్యక్తీకరించగలిగిన అద్వితీయ నటుడు శశికపూర్. ఆయన మరణం నిజంగా ఓ శకానికి తెరపడినట్లే. హీరో అంటే నాలుగు ఫైట్లు, మూడు పాటలు అని కాకుండా పది కాలాలపాటు నిలబడగలిగేవాడే అని, రాశి కంటే వాసికే పెద్దపీట వేసిన శశికపూర్ నిరూపించాడు. ‘లిఖే జే ఖత్ తుఝే’ పాటలో శశికపూర్ ఉత్సాహభరితమైన అభినయాన్ని ఎలా మర్చిపోగలం. అలాగే ‘తుమ్ బిన్ జావూ కహా’ అంటూ ఆర్ద్రతతో కూడిన భావ స్ఫోరకతను ఎలా విస్మరించగలం. ‘లే జాయేంగే లే జాయేంగే’ అన్న ఉత్తేజాన్ని మూర్త్భీవించుకున్న ఎన్నో పాటలు నిత్యం మనకు శశికపూర్ రూపాన్ని కళ్లకు కడతాయి. ఏ హీరోకూ లేని ప్రత్యేకత శశికపూర్‌కు ఉందని చెప్పడానికి సందర్భోచితంగా ఆయన చెప్పిన సంభాషణలే నిదర్శనం. దీవార్ సినిమాలో ఇప్పటికీ గుర్తుపెట్టుకునే రీతిలో శశి డైలాగ్ ఉంటుంది. ‘మేరా పాస్ బంగ్లా హై.. ధన్ హై.. దౌలత్ హై.. క్యాహై తుమ్హారే పాస్..’ అని అమితాబ్ అన్న మాటకు శశి ఇచ్చిన ఒకే ఒక్క డైలాగు ఎవరినైనా కదిలిస్తుంది. ఆ ఉదాత్తత ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఆ డైలాగే ‘మేరే పాస్ మాఁ హై’.

- బుద్ధవరపు