జాతీయ వార్తలు

కర్నాటకలో జేడీఎస్ అధికారంలోకి వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, డిసెంబర్ 5: కర్నాటకలో జేడీయస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని మాజీ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు. బళ్ళారిలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి దీటుగా ఓట్లు సాధించి అధికారం చేజిక్కించుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను ఎన్నికలకు సమాయాత్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు, ప్రజలు జేడీఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. సమావేశం లో జేడీఎస్ జాతీయ కార్యాధ్యక్షులు పీజీఆర్.సిద్యా, ప్రధానకార్యదర్శి జప్తుల్లాఖాన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరావు నాడగౌడ, జిల్లా అధ్యక్షులు కె.శివప్ప, ప్రతాప్‌రెడ్డి, మీనళ్ళి తాయణ్ణ తదితరులు పాల్గొన్నారు.