జాతీయ వార్తలు

అయోధ్యపై సయోధ్య!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాన్ని త్వరగా ముగించాలి
అదే.. దేశానికీ మంచిది
తీర్పు ఏదైనా శిరసావహిస్తాం
స్పష్టం చేసిన హజీ మహబూబ్
సిబల్ వాదనపై సున్ని ఆగ్రహం
ఇరకాటంలో పడిన కాంగ్రెస్
తెరవెనుక కథ నడుపుతున్న ఎన్డీయే?
2018 నాటికి ముగించే యోచన
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏకాభిప్రాయం కుదురుతుందా? సున్ని వక్ఫ్ బోర్డు సభ్యుడు హజీ మహబూబ్ చెబుతున్నది నిజమే అయితే వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదానికి తెరపడి అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా వివాదానికి తెరదించేందుకు వెంటనే సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కేసు విచారణ వాయిదా వేయాలన్న కపిల్ సిబల్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఆయన సున్ని వక్ఫ్ బోర్డు న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్ లాయరుగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. ‘ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ వివాదంపై సుప్రీం కోర్టు వెంటనే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’ అని హజీ మహబూబ్ బుధవారం డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పు శిరసావహిస్తామని కూడా ప్రకటించారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యున్నత కోర్టు ఆదేశిస్తే అలాగే కానివ్వండి. అయితే వివాదానికి వీలైనంత త్వరగా తెరదించితే దేశానికి మంచిది‘ అని మహబూబ్ అభిప్రాయపడ్డారు. సున్ని వక్ఫ్ బోర్డుకు చెందిన మరో ఇద్దరు సభ్యులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కోరుతూ షియా వక్ఫ్ బోర్డు సభ్యులు చేసిన ప్రకటనను ప్రస్తావించినపుడు ‘షియా వర్గానికి ఈ వివాదంతో ఎలాంటి సబంధం లేదు. వివాదాస్పద భూమి షియాలదని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు. ఉంటే తమముందు పెట్టాలి’ అని మహబూబ్ డిమాండ్ చేశారు. అయోధ్య వివాదాన్ని అంతా రాజకీయం చేస్తున్నారు, ఇది దేశానికి మంచిదికాదు అని అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంలో అసలు కక్షిదారుడిని తాను మాత్రమేనని, సుప్రీం కోర్టు ఈ వివాదంపై వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కపిల్ సిబల్, శ్రీశ్రీ రవిశంకర్ తదితరులంతా ఏదేదో చేస్తున్నారు. సుప్రీం త్వరగా తీర్పు ఇవ్వటం ద్వారా వీరందరి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
‘2019లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ విచారణ వాయిదా వేయమనడం అసంబద్ధం. ఈ వివాదం కొనసాగినంత కాలం కొందరు రాజకీయం చేస్తూంటారు. ఇది దేశానికి మంచిది కాదు’ అని స్పష్టం చేశారు.
ఇరకాటంలో కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అయోధ్య విచారణ వాయిదా వేయాలంటూ సుప్రీంలో కపిల్ సిబల్ చేసిన వాదన కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. సున్ని వక్ఫ్ బోర్డు లాయరుగా కాకుండా కాంగ్రెస్ లాయర్‌గా సిబల్ వ్యవహరించారని సున్ని వక్ఫ్ బోర్డు ముగ్గురు సభ్యులు స్పష్టం చేశారు. కపిల్ సిబల్ తన పరిధిదాటి వ్యవహరించారని దుయ్యబట్టారు. విచారణ వాయిదా తాము కోరుకోవడం లేదని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నామని వారు వెల్లడించారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో పడేసింది.
కపిల్ సిబల్ సున్ని వక్ఫ్ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వకేట్ కానేకాదని బోర్డు సీనియర్ సభ్యుడు జఫర్ ఫారూకీ స్పష్టం చేయటం ఆ పార్టీకి మరో దెబ్బ. కపిల్ సిబల్ ఒక ప్రయివేట్ పార్టీ తరఫున సుప్రీం విచారణలో పాల్గొన్నారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సుప్రీం విచారణలోవున్న అయోధ్య వివాదాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయించటం ద్వారా రామమందిర నిర్మాణానికి తెరలేపాలని యోచిస్తున్నట్టు తెలిసింది. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే మందిర నిర్మాణానికి సంబంధించిన పని మొదలుపెట్టాలన్నది సంఘ్ పరివార్ వ్యూహంగా చెబుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో ఒకవైపు విచారణ కొనసాగుతున్న సమయంలోనే మోదీ ప్రభుత్వం తెరవెనక ఏకాభిప్రాయ సాధన యత్నాలు కొనసాగిస్తోంది. శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు పలువురు ఇతర మతపెద్దలూ ముస్లిం నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. వీలైతే సమస్యపై కోర్టు వెలుపలే ఒక అవగాహనకు రావాలన్నది ఎన్డీయే ప్రభుత్వ వ్యూహంగా చెబుతున్నారు. అయోధ్యలో రామమందిరం, లక్నోలో భవ్య మసీదు నిర్మాణం ప్రాతిపదికన తెరవెనక చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.