జాతీయ వార్తలు

ఢిల్లీ ఆసుపత్రి లైసెన్స్ రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రాజధాని ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ మేక్స్ ఆసుపత్రి లైసెన్స్ రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసుపత్రిలో జన్మించిన కవలల్లో ఒకరు బతికి ఉన్నప్పటికీ ఇద్దరూ చనిపోయారని ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఇచ్చేశారు. తీరా ఇంటికెళ్లి చూడగా ఒకరు ప్రాణంతోనే ఉన్నట్టు గమనించి కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన ఈ ఘటనను ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మేక్స్ ఆసుపత్రి నిర్లక్ష్యవైఖరిపై విచారించడానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. కమిటీ తన నివేదికను ఆరోగ్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్‌కు అందచేసింది. నివేదికను పరిశీలించిన వైద్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) ఆసుపత్రి లైసెన్స్ రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణం ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇన్‌పేషెంట్లను చేర్చుకోవద్దని, ఔట్ పేషెంట్లకు ఎలాంటి సర్వీసులు అందించవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. రోగులను దోచుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక్క మేక్స్ ఆసుపత్రే కాదు ప్రైవేటు ఆసుపత్రి ఏదైనా వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆరోగ్య మంత్రి జైన్ మేక్స్ ఆసుపత్రి లైసెన్స్ రద్దుచేశామని, తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.