జాతీయ వార్తలు

రేపే రాహుల్ పట్టాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిసెంబర్ 11 సోమవారం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవ వేడుకలు పూర్తవడంతో, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు సోమవారం ప్రకటించాలని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి ముల్లపల్లి రామచంద్రన్ నిర్ణయించినట్టు తెలిసింది. సోనియాగాంధీ పార్టీకి చెందిన ఇతర సీనియర్లతో చర్చించిన తరువాతే ఈ ముహూర్తాన్ని నిర్ణయించారని చెబుతున్నారు. రాహుల్ గాంధీ సోమవారం ఎలాంటి ఆడంబరం లేకుండా పార్టీ అధ్యక్ష పదవి చేపడతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల మధ్యలో ఢిల్లీలో ఏఐసిసి సమావేశం నిర్వహించి రాహుల్‌గాంధీ ఎన్నికకు సంబంధించిన పార్టీ పరమైన ప్రక్రియను పూర్తిచేస్తారని అంటున్నారు. ముల్లపల్లి రామచంద్రన్ ప్రకటించిన పార్టీ ఎన్నికల షెడ్యూలు ప్రకారం అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసినవారు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు డిసెంబర్ 11 చివరి తేదీ. అందుకే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే ప్రకటనను
సోమవారం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు శనివారం సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూనే, వీడ్కోలు కూడా పలికారు. సోనియాగాంధీ ఆదివారం వరకే అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. రాహుల్ గాంధీ సోమవారం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని ప్రారంభిస్తారు. ఈ కారణం చేతనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీలు శనివారం పెద్దసంఖ్యలో 10, జనపథ్‌కు వచ్చి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి పార్టీ అధినేత్రికి శాలువా బహూకరించి సన్మానించారు. మీ నాయకత్వంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని ప్రశంసించారు. రాహుల్ నాయత్వంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవటంతోపాటు కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.