జాతీయ వార్తలు

సీఆర్‌పీఎఫ్ క్యాంపులో జవాను కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 9: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది. సీఆర్‌పీఎఫ్ క్యాంపులో తోటి అధికారులు, సిబ్బందిపై జవాను విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు మృతిచెందారు. అందరూ క్యాంప్‌లో ఉన్న సమయంలో భీకరమైన కాల్పులతో జవాన్ విరుచుకుపడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలు సహా మొత్తం నలుగురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న 168 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంపులో ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో క్యాంపులో జవాన్‌గా పని చేస్తున్న శాంత్‌కుమార్ తన సర్వీస్ వెపన్ ఏకే 47తో వివక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మొదట క్యాంపులో ఎస్‌ఐలుగా పని చేస్తున్న విక్కీ శర్మ, మేఘ సింగ్‌లపై
కాల్పులకు దిగాడు. వారు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం ఉద్రేకంతో తోటి సిబ్బందిపై జవాన్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో ఈ కాల్పుల్లో ఏఎస్‌ఐ రజ్బీర్‌సింగ్, కానిస్టేబుల్ జీఎస్ రావు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దాలు విని పరుగెత్తుకొచ్చిన మరో ఎస్‌ఐ గజ్‌నంద్‌పై సైతం జవాను శాంత్‌కుమార్ కాల్పులకు దిగాడు. గజ్‌నంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక హెలీకాప్టర్‌లో రాయపూర్ తరలించారు. కాల్పుల ఘటనను దంతెవాడ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సుందర్‌రాజ్ పి.వాసు ధ్రువీకరించారు. జవాన్ ఏ కారణంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనే దానిపై సమాచారం లేదు. కాగా కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేత కోసం ఈ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. నిత్యం కూంబింగ్‌లు, ఆపరేషన్లతో క్యాంపుల్లో పని చేస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. జవాన్లు సెలవులు అడిగితే ఉన్నతాధికారులు ఇవ్వకపోవడం, వారిపై మరింత ఒత్తిడి పెంచడం వంటి చర్యలతో జవాన్లు మానసికంగా కుంగిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఇటువంటి దారుణాలు చోటు చేసుకున్నా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. పలు సందర్భాల్లో సెలవులు కోరుతూ సిబ్బంది విన్నవించుకున్నా నెలల తరబడి నాన్చుతూ ఉన్నతాధికారులు ప్రవర్తించడంతో ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

చిత్రం..కాల్పుల్లో మృతి చెందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ. గాయపడిన ఎస్‌ఐ గజ్‌నంద్